Begin typing your search above and press return to search.

అమ్మ పార్టీ అభ్యర్థి అడ్డంగా దొరికిపోయాడు

By:  Tupaki Desk   |   5 April 2017 4:51 PM IST
అమ్మ పార్టీ అభ్యర్థి అడ్డంగా దొరికిపోయాడు
X
2014 ఎన్నికల సందర్భంగా ఒక్కో ఓటుకు రెండు వేల దాకా డబ్బులు పంచుతున్నట్లు వార్తలొస్తే ఔరా అనుకున్నాం. కానీ మూడేళ్లలోనే ఓటు రేటు ఎంత పెరిగిందో చూడండి. ప్రస్తుతం ఓటు రేటు రూ.4 వేలు పలుకుతోంది. ఇదంతా గాలి వార్తే అని కొట్టి పారేయడానికి కూడా లేదు. ఇందుకు వీడియో సాక్ష్యాలు సైతం ఉన్నాయి. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అమ్మ పార్టీ అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్.. ఒక్కో ఓటుకు రూ.4 వేలు పంచుతున్నాడు. ఇలా డబ్బులు పంచుతూ అతను అడ్డంగా దొరికిపోయాడు.

దినకరన్ తన అనుచరులతో కలిసి ఆర్కేనగర్ నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి డబ్బులు పంచుతుండగా తీసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చేతిలో రూ.2 వేల రూపాయల నోట్ల కట్ట పెట్టుకున్న దినకరన్.. ఓ ఇంటి వద్ద ఒక ఓటరుకు రెండు నోట్ల చొప్పున ఇస్తుండగా ఎవరో వీడియో తీశారు. దాన్ని ఒక టీవీ ఛానెల్ ప్రసారం చేసింది. అదిప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న శశికళ వర్గం ఆర్కే నగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ ఎన్నికల్లో ఓడితే అధికార పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం లేదని తేలిపోతుంది. అందుకే భారీగా డబ్బులు పంచి ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఐతే డబ్బు పంచిన వీడియో బయటికి రావడంతో ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ వీడియా ఆధారంగా ఈసీ దినకరన్ మీద చర్యలకు సిద్ధమవుతుండగా.. అది బయటికి వచ్చినప్పటి నుంచి దినకరన్ బయటెక్కడా కనిపించట్లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/