Begin typing your search above and press return to search.

మోహన్ బాబును టాలీవుడ్ వెలి వేసిందా?

By:  Tupaki Desk   |   8 April 2019 6:40 AM GMT
మోహన్ బాబును టాలీవుడ్ వెలి వేసిందా?
X
సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు వర్సెస్ తెలుగుదేశం పార్టీ మధ్య నడుస్తున్న మాటల యుధ్దం అంతకంతకూ ముదురుతోంది. తాజాగా మోహన్ బాబును ఉద్దేశించి తుడా ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీ ప్రభుత్వం మీదా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్న మోహన్ బాబు మీద కొత్త తరహా ఆరోపణలు.. విమర్శలతో పాటు.. సంచలన వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మోహన్ బాబును ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ వెలి వేసినట్లుగా తుడా ఛైర్మన్ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఎంపీ నిధులతో తన విద్యా సంస్థ అయినా శ్రీవిద్యానికేతన్ భవన నిర్మాణాలకు వినియోగించినట్లుగా ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టాలన్నారు.

క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల నుంచి సెల్ ఫోన్లు తీసుకొని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. మోహన్ బాబును తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికే వెలివేసిందన్న ఆయన.. పరిటాల రవి కుటుంబాన్ని అడ్డంపెట్టుకొని హైదరాబాద్లో అనేక ఆస్తుల్ని సంపాదించుకున్నారని ఆరోపించారు. పరిటాల రవిని హత్య చేసిన వారితో మోహన్ బాబు కుమ్మక్కు అయ్యారని మండిపడ్డారు. ఈ ఆరోపణలు.. విమర్శలకు మోహన్ బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.