Begin typing your search above and press return to search.
మోడిలో ట్యూస్ డే టెన్షన్
By: Tupaki Desk | 6 Aug 2021 4:56 AM GMTప్రధానమంత్రిలో మంగళవారం (ట్యూస్ డే) టెన్షన్ మొదలైనట్లే ఉంది. ఎందుకంటే పెగాసస్ స్పైవేర్ పై విచారణ మొదలుపెట్టిన సుప్రింకోర్టు విచారణను మంగళవారానికి వాయిదావేసింది. మంగళవారం జరిగే విచారణలో కేంద్రప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు హాజరుకావాలని ఆదేశించింది. కేంద్రప్రభుత్వానికి సంబందించిన ప్రతినిధులంటే ఐటి, హోంశాఖ ఉన్నతాధికారులని సమాచారం. కేంద్రం ప్రతినిధులు హాజరుకావాలని ఆదేశించిందంటే పెగాసస్ స్పైవేర్ పై దాఖలైన పిటీషన్లన్నీ విచారణార్హమైనవే అని సుప్రింకోర్టు నిర్ధారించినట్లే. పైగా మీడియా వచ్చిన వార్తలు నిజమే అయితే పెగాసస్ స్పైవేర్ అంశం చాలా తీవ్రమైనదే అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించటం గమనార్హం.
ఇక్కడే నరేంద్రమోడి, అమిత్ షా లో టెన్షన్ మొదలవుతోంది. ఎందుకంటే పెగాసస్ స్పైవేర్ పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి విచారణ ప్రయత్నాన్ని బీజేపీ ఎంపిలు అడ్డుకున్న విషయం తెలిసిందే. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి కూడా సంబంధిత ఉన్నతాధికారులందరినీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. విచారణ మొదలైతే కేంద్రం బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న ఉద్దేశ్యంతో అసలు సమావేశాన్ని జరగనీయకుండా బీజేపీ ఎంపిలు అడ్డుపడ్డారు.
అప్పుడే స్పైవేర్ ను ఉపయోగించి దేశంలోని ప్రతిపక్ష నేతలు, వారి పీఎస్+పీఏలతో పాటు చాలామంది ప్రముఖుల మొబైళ్ళను కేంద్రం ట్యాపింగ్ చేసిందనే అనుమానాలు పెరిగిపోయాయి. విచిత్రమేమిటంటే ట్యాప్ అయిన మొబైళ్ళల్లో సుప్రింకోర్టు జడ్జీలు, సుప్రింకోర్టు రిజిస్ట్రార్లు, మాజీ జస్టిస్ లాంటి అనేకమందున్నారు. ప్రతిపక్షాల సమావేశాలకు సమాధానం చెప్పుకోలేకే పార్లమెంటులో ఫోన్ ట్యాపింగ్ అంశంపై చర్చకు కానీ సమాధానం చెప్పటానికి కానీ మోడి నిరాకరిస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే మంగళవారం నుండి మొదలయ్యే సుప్రింకోర్టు విచారణలో కేంద్ర ప్రతినిధులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి. పెగాసస్ స్పైవేర్ తో ట్యాపింగ్ జరుగుతోందని చెబుతారా ? లేకపోతే ఇది దేశభద్రతకు సంబంధించిన అంశం కాబట్టి న్యాయస్ధానంలో విచారణ జరిపేందుకు లేదని అడ్డంగా వాదిస్తారో చూడాలి. ఏదేమైనా కరోనా వైరస్ సమస్యను డీల్ చేయటంలో దారుణంగా ఫెయిలైన మోడి ఇపుడు పెగాసస్ సాఫ్ట్ వేర్ అంశంలో ఆరోపణలు ఎదుర్కోవటం గమనార్హం.