Begin typing your search above and press return to search.
30 శాతం పూర్తిచేస్తే బాబు రికార్డు కొట్టేస్తున్నారు
By: Tupaki Desk | 10 Jan 2017 4:43 PM GMTపోలవరం ప్రాజెక్టు 2018 కల్లా పూర్తి చేస్తామన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటనపై ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ఘాటు సెటైర్ వేశారు. పోలవరానికి శంకుస్థాపన చేసి కుడికాలువ 90 శాతం - ఎడమ కాలువ 70 శాతం పూర్తయిందీ కాంగ్రెస్ హయాంలోనేనని వివరించారు. అయినప్పటికీ తమ హయాంలోనే పూర్తి చేస్తున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చేయని పనులకు సైతం రికార్డులు సృష్టించుకోవడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా ఉంటారని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు.
నదుల అనుసంధానం - ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో చంద్రబాబు చెప్తున్నవని వక్రీకరణలేనని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామనే చంద్రబాబు మాటల్లో నిజం ఉంటే... పురుషోత్తపట్నం ఎత్తిపోతలను ఎందుకు చేపుడుతున్నాట్లో చెప్పాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం కమీషన్ల కోసమే ఆ ఎత్తిపోతలను చేపడుతున్నారని పైగా జాతిని ఉద్దరిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పట్టిసీమ విషయంలోనూ ఇదే రీతిలో పనులు ఒకటి - ప్రచారం ఇంకొకటి అన్నట్లుగా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల విషయంలో టీడీపీ నిర్లక్ష్యాన్ని, అవినీతిని నిరూపిస్తామని తులసిరెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టుల అంచనాల వ్యయాన్ని అసాధారణంగా పెంచారని, దీనిపై టీడీపీ బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు., . ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ.40 వేల కోట్లు అవసరమైతే 2018 కల్లా పోలవం పూర్తి కావాలంటే రూ.37 వేల కోట్లు కేంద్రం నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయినప్పటికీ ఈ విషయాలను వెల్లడించకుండా మభ్యపెట్టే మాటలు చెప్తున్నారని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/