Begin typing your search above and press return to search.
తుమ్మల నోటి నుంచి వచ్చిన పిడుగు మాట వెనుక అసలేం జరిగింది?
By: Tupaki Desk | 4 Aug 2022 4:49 AM GMTతనకు అవసరంగా మారాలే కానీ.. ఎక్కడో పడుకున్నోడ్ని సైతం లేపి.. రాత్రికి రాత్రి హీరోను చేసే యవ్వారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాస్తంత ఎక్కువనే చెప్పాలి. అప్పటివరకు అప్రాధాన్యంగా ఎందుకు వ్యవహరించారన్న ప్రశ్న రాకుండా ఆయన తన మాటలతో కవర్ చేస్తుంటారు. నెత్తిన కూర్చోబెట్టుకునే కేసీఆర్.. తాను అనుకున్న లక్ష్యానికి చేరుకున్నా.. పని అయిపోయినా.. అవసరం తీరినా.. నెత్తిన పెట్టుకున్నోడ్ని ఇట్టే పక్కన పడేయటం.. అసలు వారి ఊసే ఎత్తకుండా నెలలు గడిపేయటం లాంటి ఎన్నో సిత్రాలు కేసీఆర్ సొంతంగా చెప్పాలి.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయంలో జరిగింది తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో తనకు సీనియర్ గా.. తాను ఫాలో అయ్యే తుమ్మలను అవసరానికి తెర మీదకు తీసుకురావటం.. అలాంటి విలువలు ఉన్న పాతతరం నేతల అవసరం పార్టీకి చాలా ఉందని చెప్పటమే కాదు.. మంత్రి పదవి ఇచ్చేసి.. తనతో పాటు తిప్పుకొని.. ఇచ్చిన ప్రాధాన్యత గురించి ప్రత్యేకతను చెప్పాలి. అయితే.. ఒక స్థాయి దాటిన తర్వాత.. పక్కన పెట్టేసే కేసీఆర్ మార్కుకు తుమ్మల సైతం మినహాయింపు కాదనే విషయం కాలం తేల్చేసింది.
అప్పట్లో మహానుభావుడిగా..రాజకీయాల్ని ఉద్దరించే నేతగా కేసీఆర్ నోటి నుంచి వచ్చిన తుమ్మల మాట.. తర్వాతి కాలంలో మాజీగా అప్రాధాన్యంగా పడిపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన అనూహ్యంగా వార్తల్లోకి వచ్చారు. ఇటీవల కాలంలో తెలంగాణ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి బీజేపీ.. కాంగ్రెస్.. టీఆర్ఎస్ కు చెందిన బలమైన నేతలకు గాలం వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోమటిరెడ్డి సోదరుల్లో రాజగోపాల్ రెడ్డిని తన జట్టులోకి లాక్కున్న వైనం.. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు తప్పవన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇలాంటివేళ.. మాజీ మంత్రి తుమ్మల నోటి నుంచి తాజాగా వచ్చిన మాట ఒకటి ఆసక్తికరంగా మారటమే కాదు.. అర్జెంట్ గా కేసీఆర్ నుంచి పిలుపు వచ్చే తీరులో ఉందన్న మాట వినిపిస్తోంది. ''సిద్దం కండి.. ఏ క్షణంలో అయినా పిడుగు లాంటి వార్త వినొచ్చు..'' లాంటి మాట తుమ్మల నోటి నుంచి రావటం.. గత ఎన్నికల్లో కార్యకర్తల్ని తాను పూర్తిస్థాయిలో కలవలేకపోయానని.. నియోజకవర్గం డెవలప్ మెంట్ కు పెద్దపీట వేసినట్లుగా చెప్పుకోవటం తెలిసిందే.
తుమ్మల నోటి నుంచి వచ్చిన 'పిడుగు' మాటకు అసలు అర్థం.. ఏమిటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొందరి అభిప్రాయంలో తుమ్మల పార్టీ మారేందుకు రెఢీ అవుతున్నారని వినిపిస్తుంటే.. రాజగోపాల్ రెడ్డి లాంటి ఎపిసోడ్ లు త్వరలో చోటు చేసుకొని మరిన్ని పిడుగు లాంటి ఉప ఎన్నికలు రానున్న విషయాన్ని ఆయన చెప్పారంటున్నారు. ఏమైనా.. ఇంతకాలం లైమ్ లైట్ లో లేని తుమ్మల.. పిడుగు మాటతో ఒక్కసారి వార్తల్లోకి రావటమే కాదు.. అందరూ ఆయన వైపు చూసే పరిస్థితి.
ఇక.. తుమ్మల నోటి నుంచి వచ్చిన పిడుగు మాట ఆయనకు నష్టం కంటే లాభమే ఎక్కువగా చేస్తుందంటున్నారు. ఇదిలా ఉంటే.. తుమ్మల సన్నిహితుల నోటి నుంచి వస్తున్న మాట మాత్రం కాస్తంత భిన్నంగా ఉంది. తుమ్మలకు పార్టీ మారే ఆలోచన లేదని.. మీడియా ప్రతినిధులు తమ బాస్ తుమ్మలను కలిసిన సందర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాత్రమే పిడుగు లాంటి మాట ఆయన నోటి నుంచి వచ్చిందంటున్నారు.
అయితే.. మీడియాలో పిడుగు మాటకు విపరీతమైన ప్రాధాన్యత లభిస్తున్న మాట నిజమే అయినా.. దానికి కారణమైన పాత్రికేయుడి ప్రశ్న మాత్రం ఫోకస్ కాలేదంటున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. తమ్మల లాంటి నేతను కేసీఆర్ పక్కన పెట్టారన్న విషయాన్ని గుర్తు తెచ్చేలా తాజా మాట చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. తుమ్మల విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.