Begin typing your search above and press return to search.
కేసీఆర్ కోసం చేతులెత్తి మొక్కిన తుమ్మల
By: Tupaki Desk | 4 July 2017 12:30 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం రహదారులు - భవనాలు - స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులెత్తి దండపెట్టారు. ఒక సందర్భంలో అసహనం వ్యక్తం చేసినప్పటికీ దానికంటే చేతులెత్తి దండంం పెట్టడమే మేలు అని భావించారేమో కానీ ఆ విధంగా తన విజ్ఞప్తి చేశారు. తుమ్మల ఇలా చేసేందుకు కారణం ప్రభుత్వ పాఠశాలలలోని ఉపాధ్యాయులు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఎన్ ఆర్ ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంచీలు - డిజిటల్ టీవీల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు చేతులెత్తి దండం పెట్టారు. ‘ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.. బడుల బలోపేతానికి కృషి చేయడంలేదు.. విధి నిర్వహణలో నిబద్ధత లోపిస్తోంది.. చేతులెత్తి నమస్కరిస్తున్నా.. పనిచేసే చోటే ఉండి పాఠాలు బోధించండి..’ అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థించారు.
బడుల బలోపేతానికి ప్రభుత్వం భారీస్థాయిలో నిధులు వెచ్చిస్తున్నా.. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా లేకపోవడం వల్లే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తుమ్మల అసహనం వ్యక్తం చేశారు. ‘సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్నారు.. మీరు కూడా ఉద్యోగం చేసే చోటే ఉండి స్కూళ్లు బాగుపడేలా చేయండి..’ అంటూ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. నిపుణులైన ఉపాధ్యాయులు, పూర్తి స్థ్ధాయిలో మౌలిక వసతులు, సదుపాయాలు ఉండి కూడా విద్యార్థులు చాలా మంది ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారంటే నిబద్ధత లోపించడమేనని అన్నారు. అనంతరం పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు టీవీలను, బెంచీలను అందజేశారు. అనంతరం మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండల కేంద్రంలో మైనార్టీ ఆశ్రమ పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల గదులన్నీ కలియతిరిగి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/