Begin typing your search above and press return to search.
ఆ ఎమ్మెల్యే గెలుపుతో తుమ్మల భవితవ్యం?
By: Tupaki Desk | 21 Oct 2018 2:30 PM GMTతెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు - ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పగల కీలక నేత తుమ్మల నాగేశ్వరరావుకు ఓ కొత్త చిక్కు వచ్చి పడిందట. అది కూడా ఏ ప్రతిపక్ష పార్టీ నుంచో....రాజకీయ ప్రత్యర్థుల నుంచో అయితే కామన్ అనుకోవచ్చు. కానీ, సాక్ష్యాత్తూ తుమ్మలు మిత్రుడు.....ఆపద్ధర్మ సీఎం ఆ చిక్కుకు కారణమట. సత్తుపల్లి నుంచి ఎస్సీ కార్పొరేషన్ చీఫ్ - మాదిగ నేత పిడమర్తి రవిని గెలిపించే బాధ్యతలను తుమ్మల భుజస్కంధాలపై కేసీఆర్ ఉంచారట. సత్తుపల్లిపై తుమ్మలకు మంచి పట్టుండడం, ఆ నియోజకవర్గంలో తుమ్మల సామాజిక వర్గానికి చెందిన ఓటింగ్ ఎక్కువగా ఉండడంతో కేసీఆర్...ఆ టాస్క్ ను ఆయనకే అప్పగించారట. అయితే, టీడీపీ నేతల నుంచి పిడమర్తి రవికి గట్టిపోటీ ఎదురుకావడం తుమ్మలకు తలనొప్పిగా మారిందట.
తన సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలతో తుమ్మల భేటీ అయ్యారట. రవి గెలుపు కోసం తనకు సహకరించాలని - రవి గెలిస్తేనే తాను మరోసారి మంత్రి అయ్యే చాన్స్ ఉందని చెప్పారట. మరోవైపు - తుమ్మల సామాజిక వర్గానికి చెందిన టీఆర్ ఎస్ కీలకనేతలంతా....టీడీపీ లోకి వెళుతున్నారట. రవికి మద్దతివ్వాలని తుమ్మల కోరుతున్నప్పటికీ.....కొత్తూరి ఉమా మహేశ్వరరావు - అంకం రాజు - గోపీ వంటి కీలక నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం తుమ్మలకు మింగుడుపడడం లేదట. దీంతోపాటు, చాలా మంది మాజీ జడ్పీటీసీ - ఎంపీటీసీ - సర్పంచ్ లు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. మరోవైపు, తనకు తుమ్మల పూర్తిగా సహకరించడం లేదని కేసీఆర్ కు రవి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనికతోడు మట్టా దయానంద విజయ్ కుమార్ కూడా రవికి సహకరించడం లేదు. ఈ పరిణామాలన్నీ తుమ్మలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట. మరి, ఈ తరహా ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని...రవిని గెలిపించి తుమ్మల మరోసారి మంత్రిపదవి చేపడతారా లేదా అన్నది తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.