Begin typing your search above and press return to search.
కాపుల సభ...రైలుకు నిప్పు..పోలీస్‌స్టేషన్‌పై దాడి
By: Tupaki Desk | 31 Jan 2016 6:59 PM GMTకాపులను బీసీలో చేర్చాలని తూర్పుగోదావరి జిల్లా తునిలో చేపట్టిన కాపు ఐక్యగర్జన ఉద్రిక్తంగా మారింది. కాపునాడు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాస్తారోకో, రైల్ రోకోలకు పిలుపునివ్వడంతో కోల్ కతా జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తుని వద్ద జాతీయ రహదారిపై ఓ వాహనంపై కూర్చుని ముద్రగడ ఆందోళన చేశారు. వేలాదిమంది కాపులు జాతీయ రహదారిపైకి రావడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు రైలు రోకో ఉద్ధృతంగా సాగింది. కాపుల ఆందోళనతో పలు రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ముఖ్యంగా విశాఖ నుంచి బయల్దేరాల్సిన గోదావరి, విశాఖ ఎక్స్ ప్రెస్ లను విశాఖ స్టేషన్ లోనే నిలిపివేశారు.
కాపులను బీసీ జాబితాలో చేరుస్తూ చంద్రబాబు ప్రభుత్వం తక్షణం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరిజిల్లా తుని రైల్వేస్టేషన్‌లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఐదు రైలు బోగీలను ఆందోళన కారులు దగ్ధం చేశారు. ఈ సంఘటనతో ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు ముందస్తు జాగ్రత్తగా నిలిపివేశారు. విశాఖలో విశాఖ, గోదావరి ఎక్స్‌ప్రెస్, పూరి - వోఖా ఎక్స్‌ప్రెస్, విశాఖ- కాకినాడ ప్యాసింజర్ రైలును నిలిపివేశారు. అదేవిధంగా ఎలమంచిలి సమీపంలో రేగుపాలెం వద్ద హౌరా - చెన్నై మెయిల్ , సామర్లకోట రైల్వే స్టేషన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, పిఠాపురంలో సికింద్రాబాద్- గౌహతి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు ఆందోళనకారులు తుని రూరల్ పోలీసుస్టేషన్‌పై దాడికి దిగి స్టేషన్‌కు నిప్పటించారు. తుని పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపులను బీసీలో చేర్చాలని చేపడుతున్న ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో సంఘటన గురించి డీజీపీ రాముడు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తుని పోలీస్ స్టేషన్ పై ఆందోళనకారులు దాడి చేశారని, ఆందోళనకారుల దాడిలో కొందరు పోలీసులు గాయపడ్డారని చెప్పారు. కావాలని కొందరు రెచ్చగొడుతున్నారని, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా చర్యలు తప్పవని డీజీ హెచ్చరించారు.
ఇదిలాఉండగా...తునిలో కాపు గర్జన సందర్భంగా తలెత్తిన పరిస్థితిపై రైల్వే జీఎం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌తో సమావేశమై చర్చించారు. ప్రభుత్వంనుంచి తమకు అదనపు భద్రత కల్పించాలని ఆయన కోరారు.