Begin typing your search above and press return to search.

సీన్ రివర్స్; ‘తుని’ ఇష్యూలో దెబ్బలు తిన్నది వారే

By:  Tupaki Desk   |   2 Feb 2016 4:04 AM GMT
సీన్ రివర్స్; ‘తుని’ ఇష్యూలో దెబ్బలు తిన్నది వారే
X
ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడని సంఘటన. ఇక.. ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే గోదావరిజిల్లాల్లో ఎప్పుడూ కనిపించని ఘటన (అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం కర్ఫ్యూ విధించిన విషయాన్ని పక్కన పెడితే..) ఆదివారం తుని పట్టణంలో చోటు చేసుకుంది. కాపు ఐక్య గర్జన ఉదంతంలో అంత పెద్ద ఎత్తున హింస చెలరేగినా.. బాధితులు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించకపోవటం కాస్త విస్మయం కలిగించే అంశం.

చిన్నపాటి లాఠీ ఛార్జ్జ జరిగినా.. ధర్నా నిర్వహిస్తున్నా.. ఆందోళనకారులకు పెద్ద ఎత్తున గాయాలు కావటం మామూలే. అలాంటింది ఒక రైలును పూర్తిగా తగలబెట్టేయటం.. రెండు పోలీస్ స్టేషన్లు.. 15 ప్రభుత్వ వాహనాలు.. మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం అయినా.. ఆందోళనకారుల్లో ఒక్కరికంటే ఒక్కరికి గాయాలు అయ్యింది లేదు. దీనికి భిన్నంగా శాంతిభద్రతల్ని కాపాడాల్సిన పోలీసులు.. వార్తలు సేకరించటానికి వెళ్లే జర్నలిస్టులు మాత్రమే తుని ఇష్యూలో బాధితులుగా మారటం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం.

చిన్న సంఘటన జరిగితేనే.. తమ ప్రతాపం ప్రదర్శించే పోలీసులు.. తుని ఇష్యూలో అత్యంత సంయమనంతో వ్యవహరించారనే చెప్పాలి. నిజానికి తుని పట్టణంలో చోటు చేసుకున్న హింసాకాండ సందర్భంగా పోలీసు అధికారి ఎవరైనా లాఠీలకు పని చెప్పటం ఖాయం. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకోవటం తుని ఇష్యూ ప్రత్యేకతగా చెప్పాలి. ఏది ఏమైనా రెగ్యులర్ గా జరిగే తీరుకు భిన్నంగా ఈ ఇష్యూలో పోలీసులు వ్యవహరించారనే చెప్పాలి.