Begin typing your search above and press return to search.
అధికారికం; రామోజీ ''ఓం సిటీ''లో ఏం ఉంటాయంటే..?
By: Tupaki Desk | 14 April 2015 7:32 AM GMTఈనాడు అధిపతి.. రామోజీ గ్రూప్ ఛైర్మన్ చెరుకూరి రామోజీరావులో ఓ ప్రత్యేకత ఉంది. ఆయనేం చేసినా భారీగా చేస్తారు. ఎవరూ ఊహించని అంశాన్ని ఊహించటమే కాదు.. దాన్ని సాకారం అయ్యేలా చేయటంలో ఆయనకు ఆయనే సాటి. క్రమశిక్షణ.. అనుకున్న లక్ష్యం సాధించేవరకు వెనకడుగు వేయపోవటం.. మూర్తీభవించిన మొండితనం.. అనుకున్న దాని కోసం దేనికైనా రెఢీ అనే దూకుడుతో పాటు.. పదేళ్ల భవిష్యత్తును ముందే ఊహించి.. అందుకు అనుగుణంగా ప్రాజెక్టులు రూపొందించే ఆయన తాజాగా ఓం ప్రాజెక్టు మీద దృష్టి సారించారు.
ఓం ప్రాజెక్టుకు సంబంధించి అధికారికంగా వచ్చిన సమాచారం అరకొర. అదే సమయంలో అనధికారికంగా వచ్చిన సమాచారం కూడా అరకొరే. అసలు అందులో ఏం చేస్తారు? అన్నది చాలాకాలంగా సస్పెన్స్‌గానే ఉంచారు. దేవాలయాలు ఉంటాయట.. అది కానీ వస్తే రోజుకు.. కేవలం ఓం సిటీ చూసేందుకు రోజుకు రెండు లక్షల మంది వస్తారని ప్రచారం జరిగింది. ఆ మధ్యన ప్రధాని మోడీని కలిసి రామోజీ అండ్ కోలు ఓం ప్రాజెక్టు గురించి ఒక పత్రాన్ని అందించి.. ఆ ప్రాజెక్టు ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పారు.
ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రామోజీ ఫిలింసిటీకి వెళ్లటం.. దాదాపు ఐదున్నర గంటలు గడపటం.. ఈ సందర్భంగా ఓం ప్రాజెక్టు గురించి ఆయనకు వివరించటం తెలిసిందే. ఈ విషయాల్ని కేసీఆర్ చెబుతూ.. ఓం ప్రాజెక్టు గురించి విపరీతంగా పొగిడేశారు
తాజాగా.. ఓం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను.. రామోజీ కలిశారు. తెలంగాణ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిసి రామోజీ.. ఓం ప్రాజెక్టుకు సంబంధించి పుస్తకాన్ని ఆయనకు అందించారు.
ఈ సందర్భంగా కేసీఆర్‌తో పాటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ.. సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు.. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనాలు పాల్గన్నారు. ఈ సందర్భంగా ఓం ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను రామోజీ.. కేసీఆర్‌కు చెప్పుకొచ్చారు. అధికారిక సమాచారం మేరకు ఓం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని వివరాల్ని బయటపెట్టారు.
అవేమంటే..
= ఓం ప్రాజెక్టుకు రామోజీ ఫిలింసిటీలోనే నిర్మిస్తారు.
= దేశంలోని 108 ప్రముఖ పుణ్యక్షేత్రాల నకళ్లు ఏర్పాటు చేస్తారు.
= ఆయా దేవాలయాల్లో ఎలాంటి పూజలు నిర్వహిస్తారో అదే విధానాన్ని ఇక్కడా పాటిస్తారు.
= పూజలే కాదు.. యాగాలు.. క్రతువులు.. ఉత్సవాలు నిర్వహిస్తారు.
= ప్రాజెక్టు పూర్తి అయితే రోజుకు రెండు లక్షల మంది ఓంసిటీని సందర్శిస్తారని ఒక అంచనా.
= ఈ ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు 30వేల మంది ప్రత్యక్షంగా.. వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించే వీలుంది.
= ఓంసిటీలోని దేవాలయాలన్నింటిని చూసేందుకు వారం రోజుల సమయం పడుతుందని అంచనా.
= దేశం మొత్తం తిరిగే శ్రమను ఈ ఓంసిటీ తగ్గిస్తుంది.
= ఓకే చోట అన్ని దేవాలయాల్ని చూసిన అనుభూతి దక్కుతుంది.
= ఈ సిటీలో మొత్తం దేవుళ్ల దర్శనాలకు వారం పడుతున్న నేపథ్యంలో.. భక్తులకు బసతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.
= ఈ మొత్తం ప్రాజెక్టుకు సౌర విద్యుత్తు వినియోగిస్తారు.
= దేవాలయాలతో పాటు మ్యూజియం.. అధ్యాత్మిక సమావేశాలు నిర్వహించుకోవటానికి ఆడిటోరియాలు ఉంటాయి.
= భక్తి సంగీత కార్యక్రమాల నిర్వహణకు వేదికలు.. వివాహ మందిరాలు.. ఆరోగ్య కేంద్రం.. భక్తి సినిమా థియేటర్లు.. హోమ నిర్వహణ ప్రదేశాలు ఉంటాయి.
= పుణ్యస్నానాలు చేసేందుకు పుష్కరిణి నిర్మిస్తారు.
= ప్రపంచంలో అన్ని విగ్రహాల కంటే ఎత్తుగా ఉండే విజయాంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వీలుంది.