Begin typing your search above and press return to search.
'తుపాకీ' సర్వే: తెలంగాణలో షర్మిలకు అంత ఈజీ కాదు!?
By: Tupaki Desk | 13 Feb 2021 12:30 AM GMTతెలంగాణ ప్రజల ఆత్మాభిమానం ఆత్మీయంగా ఉంటుంది. నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు. నచ్చకపోతే పాతరేస్తారు. వారికి ఏదైనా ఎక్కువే అంటారు. ఇక్కడి నీళ్లు, నిధులు, నియామకాల కోసం దశాబ్ధాలుగా ఆంధ్రా నేతలతో పోరాడి చివరకు రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ క్రమంలోనే అభివృద్ధి , ఉద్యోగాల్లో చాలా వివక్షకు గురయ్యారు. అందుకే ఆంధ్రా నేతల వాసననే ఇక్కడి ప్రజలు గిట్టడం లేదు. సహించడం లేదని పోయిన ఎన్నికల్లో రుజువైంది.
అంతదాకా ఎందుకు.. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆంధ్రాప్రజలు నివసిస్తున్నారు. వారు తెలంగాణ వాసులుగానే ఇక్కడ స్థిరపడిపోయారు. తెలంగాణ సంస్కృతిలో ఇమిడిపోయారు. హైదరాబాద్ మహానగర ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను, ప్రతిపక్ష బీజేపీని గెలిపించారే కానీ.. ఆంధ్రా పార్టీ అయిన తెలుగుదేశంను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుతో జట్టు కట్టిన పాపానికి ప్రతిపక్ష కాంగ్రెస్ ను సైతం ఓడించారు. అంటే తెలంగాణ ప్రజలు ఇక్కడి పార్టీలకే పట్టం కడుతారని తేటతెల్లమైంది. అయినా ఆంధ్రుల ఆశ చావడం లేదు.తాజాగా తెలంగాణ ఇంటి కోడలుగా మారిన ఏపీ సీఎం జగన్ చెల్లెలు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నట్టు చూచాయగా తెలిపారు. 'రాజన్న రాజ్యం' తెస్తానంటూ ఆంధ్రా నేత పాలన వైభవాన్ని కొనియాడారు.
దీనిపై తాజాగా మా 'తుపాకీ.కామ్' పోల్ నిర్వహించింది. 'తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల స్థాపించే పార్టీ ప్రభావం ఉంటుందా?' అని పాఠకులకు ప్రశ్న సంధించగా ఆశ్చర్యకరమైన స్పందన వచ్చింది..'తుపాకీ' సర్వేలో ఏకంగా 63.27శాతం మంది వైఎస్ షర్మిల పార్టీ ప్రభావం తెలంగాణలో అస్సలు ఉండదంటూ కుండబద్దలు కొట్టారు. ఆమెకు మనుగడ కష్టమన్నారు.
ఇక తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం ఉంటుందని 30.26శాతం మంది అభిప్రాయపడ్డారు. షర్మిల రాకను స్వాగతించారు.ఇక ఈ సందిగ్ధ స్థితిలో తాము ఏమీ చెప్పలేమని షర్మిల పార్టీపై 6.47శాతం మంది సమాధానం దాటవేశారు.పాఠకుల అభిప్రాయాన్ని బట్టి షర్మిల పార్టీకి తెలంగాణలో అంత ఈజీ కాదని తేటతెల్లమైంది. అయితే ఆంధ్రా ప్రాబల్య హైదరాబాద్, ఖమ్మం లాంటిచోట్ల షర్మిల ప్రభావం కనిపించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.