Begin typing your search above and press return to search.
నంబర్ 1 తెలుగు వెబ్ సైట్.. తుపాకీ.కాం
By: Tupaki Desk | 23 Sep 2016 1:12 PM GMT తెలుగు రాష్ట్రాలకు చెందిన వార్తలను అందించడంలో ముందున్న ఏకైక న్యూస్ వెబ్ సైట్ తుపాకీ.కాం దేశవిదేశాల్లోని తెలుగువారి ఆదరణ పొందిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తుపాకీకి తిరుగులేని ఆదరణ ఉందనేది ఇంతవరకు అందరి నోళ్లలోని మాటే.. కానీ, ఇప్పుడు వెబ్ సైట్ల ర్యాంకింగులు ఇవ్వడంలో సార్వజనీన గుర్తింపు, ఆమోదం ఉన్న అలెక్సా.కాం (ఇది అమెజాన్ కు చెందిన సంస్థ) లోనూ ఇండియా ర్యాంకింగ్స్‌లో తుపాకీకి నంబర్ 1 స్థానం దక్కడంతో అధికారికంగా భారత దేశంలో తుపాకీ మొదటి స్థానంలో ఉన్నట్లయింది. ప్రధాన మీడియాలను పక్కన పెడితే వెబ్ మీడియాలోని న్యూస్ పోర్టల్స్ లో మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే తుపాకీదే అగ్రస్థానం. తుపాకీకి ఈ స్థానం అందించిన పాఠకులందరికీ వందనం. మన దేశంలో 35 లక్షల వెబ్ సైట్లు ఉన్నట్లు ఓ అంచనా. అన్ని లక్షల సైట్లలో ప్రాంతీయ భాషలో వార్తలిస్తూ తుపాకి 258వ ర్యాంకు సాధించడం అంటే అది అసాధారణ విషయంగా చెప్పుకోవాలి.
తెలుగులో ప్రధాన వార్తాపత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిల వెబ్ సైట్లు మాత్రమే తుపాకీ కంటే ముందున్నాయి. మిగతా తెలుగు పత్రికల వెబ్ సైట్లు కూడా తుపాకీ తరువాతే ఉన్నాయి. అలెక్సా.కాంలో తుపాకీ భారత ర్యాంకింగు ప్రస్తుతం 258 గా ఉంది. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి తప్ప ఇంకే తెలుగు వార్తా వెబ్ సైట్ ఇంతకంటే మెరుగైన ర్యాంకులో లేదు. దీంతో కేవలం వెబ్ సైట్లనే లెక్కలోకి తీసుకుంటే తుపాకీ.కాం ప్రథమ స్థానంలో ఉన్నట్లు.
తెలుగులో వార్తా వెబ్ సైట్లు లెక్కలేనన్ని ఉన్నా అన్నీ ఏదో ఒక పార్టీకి వంత పాడేవో.. లేదంటే నేతలకు భజన చేసేవిగానో ఉన్నాయి. కానీ.. వార్తలను వార్తలా నిష్పాక్షికంగా ఇచ్చే వెబ్ సైట్ ఒక్క తుపాకీ మాత్రమే. అంతేకాదు తెలుగు రాష్ర్టాల వార్తలకే ప్రథమ ప్రాధాన్యమిచ్చి, వాటితో పాటు అంతర్జాతీయంగా అన్ని ఆసక్తికరమైన వార్తలను పాఠకులకు అందించడం తుపాకీ నైజం. రాజకీయాలను-సినిమాను సమ ప్రాధాన్యంతో చూసే ఏకైక మీడియా తుపాకి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఆదరాభిమానాలు పొంది ముందు నిలిచింది. ఈ ఘనత తుపాకీ పాఠకులది. టెక్నాలజీ యుగం పెరిగిన తరువాత పత్రికల జోరు తగ్గి టీవీలు.. ఆ తరువాత టీవీల వీక్షణమూ తగ్గి వెబ్ సైట్లు... ఇప్పుడు కొత్తగా యాప్ లు రాజ్యమేలుతున్న తరుణంలోనూ తుపాకీ.కాం కు తిరుగులేని పాఠకాదరణ దక్కడానికి కారణమైన పాఠకులదే ఈ విజయం. పాఠకులు అందించిన విజయం.. వారు మా వెన్నంటి ఉన్నారన్న ధైర్యం - వారిచ్చిన బలంతో ఇప్పుడు మేం ''తెలుగు వార్తల గన్ తుపాకీ.కాం నంబర్ వన్" అని సగర్వంగా ప్రకటించుకుంటున్నాం. మీ సహకారం ఉన్నంత కాలం మరింత సరళంగా - వేగంగా - కచ్చితత్వంతో వార్తలను అందిస్తూ మీ మనసు దోచుకోవడానికి ప్రయత్నిస్తాం.
మరోసారి తుపాకి పాఠకులందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు.