Begin typing your search above and press return to search.
అక్కడ 13 వేలమంది పోలీసులపై వేటేశారు!
By: Tupaki Desk | 4 Oct 2016 4:55 PM GMTనిర్లక్ష్యంతో వ్యవహరిస్తే.. పది మంది మీదనో.. పాతిక మంది మీదనో చర్యలు తీసుకోవటం మామూలే. కానీ.. తేడాగా వ్యవహరించారన్న కారణంగా ఏకంగా 13వేల మంది పోలీసులపై వేటు వేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది టర్కీ సర్కారు. దేశ మొత్తమ్మీదా ఉన్న పోలీసుల్లో 5 శాతం మంది పోలీసుల్ని సస్పెండ్ చేస్తూ టర్కీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆ మధ్యన దేశంలో సైనిక తిరుబాటు జరగటం.. ఈ సందర్భంగా సైనిక తిరుగుబాటులో ఆరోపణలు ఎదుర్కొన్న ఫెతుల్లాతో ఈ పోలీసులకు సంబంధాలు ఉన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం భారీ వేటుకు రంగం సిద్ధం చేసింది. దేశంలో ప్రభుత్వాన్ని కూలదోయటానికి కుట్ర పన్నిన వారితో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఒక్కసారిగా 12,801 మందిపై వేటు వేశారు. వీరిలో అధికారులు 2,523 మంది ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుట్ర చేసిన ఫెతుల్లాతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలు ఉండటంతో పాటు.. గులెనిస్ట్ టెర్రర్ అనే సంస్థతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు మూకుమ్మడి వేటు వేసినట్లుగా చెబుతున్నారు. వేలాది మందిపై ఒక్కసారిగా వేటు వేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/