Begin typing your search above and press return to search.
షార్ట్ డ్రెస్ వేసుకుందని అలా చేశాడు!
By: Tupaki Desk | 19 Sep 2016 6:47 AM GMTమహిళలపై దాడులు జరగడంలో ఏ దేశం ఏమాత్రం తీసిపోదు. ప్రపంచంలోని అన్ని చోట్ల మహిళలపై రకరకాల దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రేమించలేదని - శృంగారానికి ఒప్పుకోలేదని.. కారణం ఏదైనా గాయపడుతుంది మాత్రం మహిళే. తాజాగా ఇదే క్రమంలో షార్ట్ డ్రెస్ లు వేసుకుందని ఒక యువతిపై దాడిచేశాడు ఓ యువకుడు. మారాల్సింది అమ్మాయిల బట్ట్ల సైజు కాదు.. మగడి వంకర బుద్ది అని ఇప్పటికే రకరకాలుగా చెబుతున్నా... ఆ యువకుడికి మాత్రం అది అర్ధం కాలేదు... షార్ట్ డ్రెస్ వేసుకుందని నేరుగా వెళ్లి దాడిచేశాడు.
టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో పొట్టి దుస్తులు వేసుకొని వచ్చిందని యువతిపై ఓ యువకుడు బస్సులో దాడి చేశాడు. "షార్ట్ డ్రెస్ లు వేసుకునేవాళ్లంతా తప్పక చచ్చిపోవాల్సిందే" అని గట్టిగా అరుస్తూ, ఆగ్రహంతో ఊగిపోతూ నేరుగా ఆమె వద్దకు వెళ్లి ముఖంపై పిడిగుద్దులు కురిపించి కాళ్లతో తన్నాడు. అనంతరం అక్కడున్నవారంతా రికాక్ట్ అవ్వడంతో దాడికి పాల్పడిన ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే ఆ యువతి నర్సు గా పనిచేస్తుంది. అరెస్టు అనంతరం స్పందించిన ఆ యువకుడు... ఆమె బట్టలు వేసుకున్న విధానం తనకు నచ్చలేదని - కోపం వచ్చిందని - అందుకే ఆమెపై దాడి అని పోలీసులకు తెలిపాడు. కాగా.. ఈ దాడికి పాల్పడిన యువకుడు ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.