Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే కాక‌ముందే... జైలు జీవితం.. చింత‌మనేని కెరీర్‌లో కీల‌క ఘ‌ట్టం

By:  Tupaki Desk   |   2 Feb 2022 2:30 AM GMT
ఎమ్మెల్యే కాక‌ముందే... జైలు జీవితం.. చింత‌మనేని కెరీర్‌లో కీల‌క ఘ‌ట్టం
X
టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఆయ‌నో ఫైర్ బ్రాండ్, ఓ పందెం పుంజు.. మాట‌కుమాట‌, చేత‌కు చేత అనే టైపులో ఉండే నాయ‌కుడు. ప‌శ్చిమ గోదావ రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2009, 2014 వ‌రుస ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఆయ‌న‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కుగా పాపులారిటీ అయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడూ.. ఆయ‌న రోజూ వార్త‌ల్లో నిలిచేవారు. ఏదో ఒక విష‌యంలో నిప్పులు చెరిగేవారు.

ఇక‌,పార్టీ అధికారం మారిపోయిన త‌ర్వాత‌.. చింత‌మ‌నేని దూకుడు.. ఇటు వైసీపీ స‌ర్కారు.. దూకుడు... వెర‌సి రాజ‌కీయ చిత్రం ర‌ణ‌రంగంగా మారిపోయింది. ఈ క్ర‌మంలో చింత‌మ‌నేనిపై కూర్చుంటే.. కేసు, నించుంటే కేసు..అన్న‌ట్టుగా పోలీసులు.. ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం.. జైలుకు త‌ర‌లించ‌డం.. వంటివి రాష్ట్ర వ్యాప్తం గా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే.. త‌న‌కు జైలుకు వెళ్ల‌డం కొత్తకాద‌ని.. ఎమ్మెల్యే కాక‌ముందే తాను జైలు కు వెళ్లిన‌ట్టు చింత‌మ‌నేని వెల్ల‌డించారు. ఇటీవల ఓ మీడియా చేసిన ఇంట‌ర్వ్యూలో చింత‌మ‌నేని మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టారు.

``పోలీసులు,, కేసులు నాకు కొత్త‌కాదు. ఎమ్మెల్యే కాక‌ముందే.. నాపై ఫ‌స్ట్ కేసు బుక్క‌యింది. అప్ప‌ట్లో మా ఊర‌మ‌య్యాయే.. ఒకావిడ‌.. నాపై కేసు పెట్టింది. సెక్ష‌న్ 354 కింద బుక్ చేసి.. జైల్లో పెట్టారు. అయితే.. ఈ కేసును అప్ప‌ట్లోనే కోర్టు కొట్టేసింది. ఇక‌, ఆ త‌ర్వాత కూడా.. నాపై కేసులు సాధార‌ణ‌మ‌య్యాయి. ఒక బ్యాంకు మేనేజ‌ర్‌ను డ‌బ్బుల కోసం బెదిరించాన‌నే కేసులో అట్రాసిటీ కేసు పెట్టారు. అప్ప‌ట్లో 12 రోజులు జైల్లోనే ఉన్నారు. ఆత‌ర్వాత‌.. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు జగ‌న్ హ‌యాంలోనే కేసులు పెడుతున్నారు. అయితే.. ఒక కేసులో బెయిల్ తీసుకుని బ‌య‌ట‌కు వ‌స్తే.. మ‌రో కేసులో వెంట‌నే పీటీ వారెంట్ వేస్తున్నారు`` అని చింత‌మ‌నేని వివ‌రించారు.

అంతేకాదు.. ఇలా.. వైసీపీ స‌ర్కారు కేవ‌లం టీడీపీ నేత‌ల‌ను హెచ్చ‌రించే క్ర‌మంలో.. వారిని క‌ట్ట‌డి చేసే క్ర‌మంలో త‌న‌ను పావుగా వాడుకుంద‌ని.. చింత‌మ‌నేని చెప్పుకొచ్చారు. జైలులో త‌న‌కు అంద‌రికోసం చేసిన అన్న‌మే పెట్టేవార‌ని.. ప్ర‌త్యేకంగా చూసింది ఏమీలేద‌ని చెప్పుకొచ్చారు. టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన‌ప్పుడు... కేవ‌లం సంఘీభావంగా రోడ్డు మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు.. త‌న‌ను అరెస్టు చేయ‌డం బాధ క‌లిగించింద‌ని.. చింత‌మ‌నేని అన్నారు. ఎన్ని కేసులు ఉన్నా.. అవేవీ త‌న‌ను ఏమీ చేయ‌లేవ‌ని.. తాను ఏ త‌ప్పూ చేయ‌లేద‌న‌ని..ఆయ‌న చెప్పుకొచ్చారు.