Begin typing your search above and press return to search.

ఈ వీడియో చూసి షాక్ తిన‌కుండా ఉండ‌గ‌ల‌రా?

By:  Tupaki Desk   |   13 Jan 2016 10:02 AM GMT
ఈ వీడియో చూసి షాక్ తిన‌కుండా ఉండ‌గ‌ల‌రా?
X
లోకో భిన్న రీతి అనే సామెత ఊరికే పుట్ట‌లేదు. కొంద‌రు అతిగాళ్లు ఉండ‌టం...వారికి మ‌ద్ద‌తు ప‌లికే మ‌హానుభావులు తోడ‌వ‌టంతోటి అనేక చిత్రాలే కాదు అరాచ‌కాలు కూడా జరుగుతాయి. ఇందుకు ప్రత్య‌క్ష ఉదాహ‌ర‌ణ ఈ వీడియో. పిల్ల‌ల ప్రేమ కోసం అంటూ త‌ల్లిదండ్రులు మూర్ఖ‌త్వం ఏ స్టేజ్‌కి చేరిందో చెప్పేందుకు చ‌క్క‌టి ఆధారం!

పిల్లలు చదవకపోతే ఏ టీచరైనా ఏం చేస్తారు? శ్రద్ధగా చదవితే చాక్లెట్లు ఇప్పిస్తామని...టూర్ల‌కు తీసుకుపోతామ‌ని ఇలా కావలసినన్ని మార్గాలు వెతుకుతుంటారు. పిల్లల్ని నాలుగు మాటలు అంటారు. అప్పుడూ వినకపోతే రెండు దెబ్బలు వేస్తారు. కానీ గుజరాత్ లోని వడోదరలో ఓ టీచర్ డిఫరెంట్ స్టైల్లో వెళ్లాడు. గాజుపెంకులపై పిల్లలను నడిపించాడు. పిల్లల్లో జ్ఞానం, ఏకాగ్రత పెరగడానికి అంటూ ట్యూషన్ పిల్లలందరితో వరుసపెట్టి ఇలా నడిపించాడు.

ఓరి వీడి అఘాయిత్యం పాడుగాను ఇదేం పిచ్చిత‌నం అనుకోకండి. ఇక్క‌డితోనే అయిపోలేదు అస‌లు ట్విస్ట్ ముందుంది. ఆ పిల్లలతో పాటే వారి తల్లిదండ్రులు కూడా నడిచారు. త‌మ పిల్ల‌ల‌కోసం ఇదంతా చేశామ‌ని చెప్పారు! పిల్లలంటే టీచ‌ర్‌ కు భయపడతారు కాబ‌ట్టి అలా చేశారనుకున్నా వాళ్ల తల్లిదండ్రులు ఇలా పిచ్చిచేష్ట‌లను ప్రోత్స‌హించ‌డం కామెడీ. న‌డ‌వ‌డంతోనే ఆ ఘ‌నులు ఆగిపోలేదు. ఈ ఘ‌న‌కార్యాన్నంతా వీడియో తీసి దాన్ని యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.