Begin typing your search above and press return to search.

చాన‌ళ్ల‌కు ఈ అర్థ‌రాత్రి ప్రైమ్ టైమ్‌

By:  Tupaki Desk   |   30 Jun 2017 9:47 AM GMT
చాన‌ళ్ల‌కు ఈ అర్థ‌రాత్రి ప్రైమ్ టైమ్‌
X
ద‌శాబ్దాల క‌స‌ర‌త్తు ఈ అర్థ‌రాత్రి ఒక కొలిక్కి రానుంది. దేశంలో అతి పెద్ద‌దైన ప‌న్నుల సంస్క‌ర‌ణ‌గా అంచ‌నా వేస్తున్న జీఎస్టీ అమ‌లు ఈ రోజు రాత్రి (శుక్ర‌వారం) 12 గంట‌ల త‌ర్వాత నుంచి అమ‌ల్లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర‌ప్ర‌భుత్వం భారీ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింది. దేశ ప‌న్ను సంస్క‌ర‌ణ‌ల్లో కీల‌క‌మైన ద‌శ‌ను గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకోవ‌టానికి కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఏర్పాట్లు చేస్తోంది. పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్ లో రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు.. ప‌లు రంగాల ప్ర‌ముఖుల మ‌ధ్య‌న జీఎస్టీ జే గంట‌ను మోగించ‌నున్నారు.

రాష్ట్రప‌తి..ఉప రాష్ట్రప‌తి.. ప్ర‌ధానితో స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మాన్ని హాజ‌రుకానున్నారు. అర్థ‌రాత్రివేళ పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్ లో వేడ‌క నిర్వ‌హించ‌టం చాలా చాలా అరుదు. ఇప్ప‌టివ‌ర‌కూ వేళ్ల మీద లెక్కించే సంద‌ర్భాల్లోనే ఇలాంటివి నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మానికి భారీ ప్ర‌యారిటీని ఇవ్వ‌నున్నాయి న్యూస్ ఛాన‌ళ్లు. లైవ్‌ల‌తో పాటు.. దేశ ప్ర‌జ‌లంద‌రి మీదా ప్ర‌భావం చూపించే జీఎస్టీ ప‌న్నుల విధానాన్ని అర్థ‌మ‌య్యేలా చేసేందుకు ప‌లు ఛాన‌ళ్లు పోటీ ప‌డి మ‌రీ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల్ని అమ‌లు చేస్తున్నాయి.

జీఎస్టీ పుణ్య‌మా అని ఈ రోజు అర్థ‌రాత్రి దాటిన వ‌ర‌కూ ఛాన‌ళ్లు ఒక‌రికి మించి మ‌రొక‌రు పోటాపోటీగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నాయి. ఇక‌.. జీఎస్టీ వేడుక‌ను లైవ్ మామూలే. దీంతో.. ఈ రోజు రాత్రి నుంచి అర్థ‌రాత్రి వ‌ర‌కూ న్యూస్ ఛాన‌ళ్లు మొత్తం బిజీబిజీగా ఉండ‌నున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. మామూలుగా అయితే అర్థ‌రాత్రి వేళ‌.. న్యూస్ ఛాన‌ళ్ల‌ను వీక్ష‌కులు చూసేది త‌క్కువే. కానీ.. జీఎస్టీ పుణ్య‌మా అని ఈ రోజు రాత్రి భారీగా వీక్ష‌కులు టీవీలు చూడ‌టం ఖాయ‌మ‌ని చెప్పొచ్చు. దీంతో.. ఈ అర్థ‌రాత్రి వేళ‌.. ఛాన‌ళ్ల‌కు ప్రైమ్ టైమ్ గా మార‌నుంది.స‌రికొత్త ప‌న్నుల విధానం ఏమో కానీ.. ఈ రోజున ఛాన‌ళ్ల హ‌డావుడి ఓ రేంజ్లో ఉంటుంద‌న‌టంలో సందేహం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/