Begin typing your search above and press return to search.
టీవీ లైవ్ షోలో ఓ రేంజ్ లో కొట్టేసుకున్నారు
By: Tupaki Desk | 14 Sep 2015 9:52 AM GMTపొద్దుపొద్దున్నే న్యూస్ ఛానళ్లలో హాట్ హాట్ గా చర్చలు సాగటం.. దానికి అనుకూల.. వ్యతిరేక ప్రతినిధులు హాజరు కావటం.. తమ అభిప్రాయాల్ని వెల్లడించటం లాంటివి మామూలే. వాడేవీడిగా విమర్శలు చేసుకోవటం.. కాస్త తిట్టేసుకోవటం.. ఆవేశపడిపోవటం మామూలే. ఈసారి అందుకు భిన్నంగా హద్దులు దాటే యవ్వారం చోటు చేసుకుంది.
వివాదాస్పద అధ్యాత్మికవేత్త రాధేమాకు సంబంధించిన ఒక చర్చా కార్యక్రమాన్ని ఐబీఎన్ 7 ఛానల్ లైవ్ నిర్వహించింది. ముంబయిలో నిర్వహించిన ఈ షోకు హిందూ మహాసభ అధ్యాత్మికవేత్త ఓమ్ జీ.. ప్రముఖ జ్యోతిష్యురాలు దీపాశర్మలు హాజరయ్యారు. చర్చ మొదలైంది. వాదనలో జోరందుకున్నాయి. ఉన్నట్లుండి అధ్యాత్మిక వేత్త ఓమ్ జీ చెంప చెళ్లుమనిపించారు దీపాశర్మ. ఎందుకంత కోపం అంటే.. రాధేమా గురించి వాదించుకునే క్రమంలో చర్చ పక్కదారి పట్టి దీపాశర్మకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఓమ్ జీ. అంతే.. ఆగ్రహం చెందిన దీపాశర్మ ఒక్క ఉదుటున లేచి ఆయన చెంప చెళ్లుమనిపించారు. అధ్యాత్మికవేత్త కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆవేశపడిపోయి.. ఆమె చెంపను వాయించేశారు. దీంతో.. ఒక్కసారి గందరగోళం చోటు చేసుకుంది. ఇరువుర్ని శాంతింపచేయటానికి యాంకరమ్మ చాలానే కష్టపడాల్సి వచ్చింది.