Begin typing your search above and press return to search.

చిరు ఫ్యాన్ ని.. పవన్ అంటే ఇష్టం.. వారిపై సంచలన స్టింగ్ ఆపరేషన్లు నావే

By:  Tupaki Desk   |   11 March 2021 4:00 AM GMT
చిరు ఫ్యాన్ ని.. పవన్ అంటే ఇష్టం.. వారిపై సంచలన స్టింగ్ ఆపరేషన్లు నావే
X
‘మహా’ మూర్తి.. ‘ఏబీఎన్’ మూర్తి.. ‘టీవీ 5’ మూర్తి.. వివిధ మీడియా సంస్థల పేర్లు ఉన్నప్పటికి మూర్తి పేరు మాత్రం కామన్. సీనియర్ టీవీ జర్నలిస్టుగా సుపరిచితమైన ఆయన ఎక్కడ పని చేస్తే.. ఆ సంస్థ పేరుతో ఫేమస్ కావటం ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే విద్య. తరచూ రాజకీయ.. సామాజిక అంశాల మీద డిబేట్లు పెట్టి.. ఇంటర్వ్యూలు చేసే ఆయన్ను వెబ్ సిరీస్ కోసం ఇంటర్వ్యూలు చేసే మరో జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తే ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి? తాజాగా అలాంటి సంచలన విషయాలు వెలుగు చూశాయి.

వ్యక్తిగంగా చిరంజీవికి వీరాభిమాని.. పవన్ భావజాలాన్ని విపరీతంగా ఇష్టపడే మూర్తి.. ప్రొఫెషనల్ గా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటమే కాదు.. ఆ ఇద్దరు పెట్టిన పార్టీల మీద స్టింగ్ ఆపరేషన్ చేసింది తానేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన కీలక అంశాల్ని ఆయన మాటల్లోనే చూస్తే..

- ‘ఆంధ్రప్రదేశ్‌లో వాస్తవానికి.. సామాజికంగా, ఒకట్రెండు కులాలకు అధికారం పరిమితమైంది. ఇది జరుగుతున్నప్పుడు ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు. నాకు వపన్ కళ్యాణ్ ఫిలాసఫీ అంటే ఇష్టం. ఆయన చెప్పే చెగువెరా సూక్తులు, అన్నీ ఒక అభ్యుదయ భావజాలం ఉన్న నూతన పంథా ఉన్న పార్టీగా అంతా భావించారు. పవన్ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేశారు. పవన్ మాటలు వింటే.. ఆయన్ను ఒక సామాజికవర్గానికి పరిమితం చేయకూడదు. సమాజాన్ని మార్పు తెద్దాం అనుకున్న వ్యక్తిపై కులం ముద్ర వేయడం మంచిది కాదనిపించేది’

- ‘ఇలాంటి వేళ కత్తి మహేష్, పవన్ కళ్యాణ్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ ఇష్యూ చినికిచినికి గాలివానగా మారి కులం ముద్ర ధరించింది. కత్తి మహేష్ దళితుడు అయినందు వల్ల.. పవన్ కళ్యాణ్ కాపు కులస్తుడు కాబట్టి ఇలా చేస్తున్నారని ఇష్యూ టర్న్ అయింది. దీంతో పవన్ కళ్యాణ్‌పై ఒక కుల ముద్ర వేసేస్తున్నారని స్టడీ చేసి.. రాష్ట్రంలో కులాల మధ్య గొడవలు రాకూడదని నేనే కత్తి మహేష్, కళ్యాణ్ దిలీప్ సుంకరను కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేశా. అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాకు కటౌట్లు పెట్టి, ఊరేగించారు’

- జనసేనలోనే ఉన్న కొంత మంది నాయకులు.. పార్టీలో కాపులకు సంబంధించిన మీటింగ్ పెడుతున్నారని, అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఫండ్ రైజింగ్ చేస్తున్నారని, మినిమం ఇంత అమౌంట్ ఇవ్వాలని.. కాపులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ మీటింగ్ ఉండబోతుందని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. జనసేనలోని దగ్గరి వ్యక్తులే ఈ విషయం చెప్పారు. దీనిపై స్టోరీ ప్లాన్ చేశాను. మహా టీవీ మేనేజ్మెంట్ కూడా చేయమని ప్రోత్సహించింది. ఏదైనా కానీ డైరెక్టుగా చూస్తే కానీ నమ్మను’

- ‘అందుకే రెండు రోజుల ముందే జనసేన కాపు మీటింగ్ జరిగే హోటల్లో రూం తీసుకున్నా. ఒక టీంను పంపించి.. పవన్ కళ్యాణ్ స్పీచ్, ఫైండ్ రైజింగ్, ఆడిటర్ మాటలు, ఇది కేవలం కాపులకు సంబంధించిన మీటింగ్ అనే అన్నీ విషయాలు రికార్డ్ చేశా. దీన్ని ఒక సజెస్టివ్ స్టోరీగా చేయాలని అనుకున్నాను. పవన్ కళ్యాణ్ ఆలోచనలు వేరు.. కానీ, పార్టీ వేరే దృక్పథంలో వెళ్తుంది, కాబట్టి దీన్ని సరిదిద్దుకోవాలని చెబుదామనే అనుకుని స్టోరీ ప్లాన్ చేశా. కానీ, పై నుంచి వచ్చిన ఒత్తిళ్లతో స్టోరీ లైవ్‌లో ఉండగానే ఆపేశారు. దీంతో అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాకు నచ్చక మహా టీవీ చానల్‌ కు రాజీనామా చేసి బయటకు వచ్చేశాను. ఇంత జరిగినా నాకు పవన్ కళ్యాణ్ పై ఎలాంటి వ్యతిరేకత లేదు’

- ‘వాస్తవానికి నేను చిరంజీవి వీరాభిమానిని. గోదావరి జిల్లాల్లో పుట్టి పెరిగా. కాలేజీ రోజుల్లో మెగాస్టార్చిరు అభిమాన సంఘానికి సెక్రటరీగా పని చేశా. సినిమాల్లో చాలా ఇష్టమైన నటుడు ఆయనే. అలా అని చిరు పార్టీలోఏదైనా జరుగుతుంటే తొక్కి పెట్టేయాలని అనుకోను. చిరంజీవి ఫ్యాన్ అసోసియేషన్ లో పని చేశానని ఆగిపోతే ప్రొఫెషన్ కు అన్యాయం చేసినట్లు అవుతుంది. వ్యక్తిగత ఇష్టాలు వేరు.. నా ప్రొఫెషన్ వేరు. అందుకే అలా బిహేవ్ చేస్తా’

- ‘లోపల నాకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉంటుంది.. కానీ, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వెళ్తుంటే కచ్చితంగా చేస్తాను. మహా టీవీలో కూర్చొని ఆ చానల్ అధినేత సుజనా చౌదరికి వ్యతిరేకంగా డిబేట్ కూడా పెట్టా’

- ‘వాస్తవానికి, చిరంజీవిని ఫస్ట్ రాజకీయ ఇంటర్వ్యూ చేసింది నేనే. సాయంత్రం పార్టీ పెడతారనగా.. ఆరోజు ఉదయం నాకు ఇంటర్వ్యూ ఇచ్చి, సాయంత్రం ఫ్లైట్ ఎక్కి తిరుపతి వెళ్లారు. ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. నాకు మాత్రమే ఇచ్చారు. మీడియా మొఘల్స్ అంతా ట్రై చేసినా ఇవ్వలేదు.. నాకిచ్చారు. అది నాపై ఆయనకున్న అభిమానం. నేను కాకినాడ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేష్ సెక్రటరీనని ఆయనకు తెలుసు. అందుకే చాలా క్లోజ్ గా ఉండేవారు.. అభిమానించేవారు’

- నిజానికి, ప్రజారాజ్యం పెట్టక ముందు పార్టీ పెడితే అధికారంలోకి వస్తుందన్న సర్వేలు కూడా ఉన్నాయి. పార్టీ ప్రకటనకు ముందు గాని, ఆ తర్వాత గాని బీభత్సమైన హైప్ ఉంది. ఆ రేంజ్‌లో ఉన్న హైప్, నెమ్మదిగా పడిపోతున్న టైంలో రాజకీయంగా ఆయనకు ఇబ్బంది అవుతుందని తెలిసినప్పుడు హెచ్చరించేందుకు ప్రయత్నించా. ప్రజారాజ్యం పార్టీలో టికెట్స్ విషయంలో ఎవరో ఏదో చేస్తున్నారని, పక్కా ఆధారాలతో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆపలేను. అదే చేసి డిబేట్ పెట్టాను. నా ప్రాబ్లం అదే.. అందుకే నన్ను అందరూ దుర్మార్గుడు అంటారు. చిరంజీవి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది నాకే.. ఇప్పటికీ ఎవరు మీ అభిమాన నటుడు అంటే.. ఎప్పటికీ నాకు చిరంజీవే అని చెప్పుకుంటా’