Begin typing your search above and press return to search.
రవిప్రకాశ్ లేకున్నా.. అగ్రస్థానంలో టీవీ9!
By: Tupaki Desk | 13 Jun 2019 11:09 AM GMTటీవీ9 అంటే రవిప్రకాశ్. రవిప్రకాశ్ అంటే టీవీ9 అన్న పరిస్థితి. అయితే.. ఇదంతా కొన్ని నెలల కిందట వరకూ. ఎప్పుడైతే టీవీ9లోని 90 శాతం వరకు వాటాల్ని మైహోం రామేశ్వరరావు అండ్ టీం టేకోవర్ చేసిందో.. అప్పటి నుంచి కొత్త ప్రమోటర్లకు.. రవిప్రకాశ్ కు మధ్య లొల్లి చోటు చేసుకోవటం తెలిసిందే. అంతకంతకూ ముదిరిపోతున్న ఈ ఎపిసోడ్ ను ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు వీలుగా.. టీవీ9 సీఈవో సీటు నుంచి రవిప్రకాశ్ ను తీసేసి.. మరొకరిని పెట్టటం తెలిసిందే.
నాటి నుంచి టీవీ9 కొత్త యాజమాన్యం వర్సెస్ రవిప్రకాశ్ కు నడుస్తున్న లొల్లి అంతా ఇంతా కాదు. ఇరువురి మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. టీవీ9 బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినేలా రవిప్రకాశ్ వ్యవహరిస్తున్నారని.. ఆయన తీరు అభ్యంతరకరంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. రేటింగ్స్ విషయంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయితే.. అలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. రవిప్రకాశ్ కెప్టెన్ గా లేనప్పటికీ బార్క్ రేటింగ్స్ లో టీవీ9 మొదటిస్థానంలో నిలవటం పై హర్షం వ్యక్తమవుతోంది. తన కారణంగానే టీవీ9 ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్లుగా రవిప్రకాశ్ చెప్పే మాటల్లో పస లేదన్న విషయం తాజాగా రుజువైందని చెబుతున్నారు.
తాజాగా విడుదలైన బార్క్ రేటింగ్స్ ను చూస్తే.. ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఫస్ట్ ప్లేస్ లో టీవీ9 నిలవగా.. తర్వాతి స్థానంలోకి సాక్షి వచ్చేయటం విశేషం. అయితే.. ఈ రెండింటి మధ్య పాయింట్స్ లో తేడా ఉండటం ఒక విశేషమైతే.. సాక్షితో పోలిస్తే మూడో స్థానంలో ఉన్న ఎన్ టీవీ.. నాలుగో స్థానంలో ఉన్న టీవీ5ల మధ్య వ్యత్యాసం కూడా ఎక్కువగా ఉండటం గమనార్హం.
అదే సమయంలో.. మూడో స్థానంలోని ఎన్ టీవీ.. నాలుగో స్థానంలో ఉన్న టీవీ5.. ఐదో స్థానంలో ఉన్న వీ6 మధ్య వ్యత్యాసం స్వల్పంగా ఉంది. అయితే.. టీవీ9 రేటింగ్ కు..మూడు.. నాలుగు.. ఐదారు స్థానాల్లో ఉన్న చానళ్ల మధ్య వ్యత్యాసం పూడ్చలేనంతగా ఉండటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి.
తాజాగా విడుదలైన బార్క్ రేటింగ్స్ చూస్తే..
1. TV9: 70
2. SAKSHI: 53
3. NTV: 40
4. TV5: 37
5. V6: 36
6. T NEWS: 23
7. AP 24×7: 20
8. ABN: 19
9. HM TV: 18
10. ETV AP: 13
11. I NEWS: 12
12. 10TV: 10
13. ETV TS: 8
14. MOJO TV: 5
15. TV1: 5
16. 99%TV: 3
17. RAJ NEWS: 3