Begin typing your search above and press return to search.
టీవీ9 జాఫర్ కు జాబ్ వచ్చింది.. ఏ చానల్ అంటే?
By: Tupaki Desk | 25 Oct 2019 7:18 AM GMTజర్నలిస్టులు చాలామంది ఉంటారు. కానీ.. కొంతమందికి అనూహ్య రీతిలో ఇమేజ్ వచ్చేస్తుంది. అలాంటి ఇమేజ్ ను సొంతం చేసుకున్న పాత్రికేయుడిగా టీవీ9 జాఫర్ ను చెప్పాలి. దాదాపు పదిహేనేళ్ల పాటు టీవీ9లో పని చేసిన అతడు ఈ మధ్యనే రిజైన్ చేయటం తెలిసిందే. రాజకీయ నేతల్ని కొత్త తరహాలో ఇంటర్వ్యూ చేయటం.. అతగాడి ఇంటర్వ్యూ స్టైల్ కొందరికి ఎబ్బెట్టుగా.. మరికొందరికి విపరీతమైన ఆసక్తిని రేకెత్తించేలా ఉండటం అతని ప్రత్యేకత.
టీవీ9లో పని చేస్తూ దాదాపు 175 మంది రాజకీయ నేతల్ని ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిన సిరీస్ చాలా పాపులర్ గా చెప్పాలి. నేతల్ని ఇబ్బంది పెట్టే రీతిలో ప్రశ్నలు అడగటం ఆయనకు మిగిలిన వారికి భిన్నమైన ఇమేజ్ ను వచ్చేలా చేసిందని చెప్పాలి. ఇదే ఆయనకు బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ అయ్యే అవకాశం లభించినా.. చాలా త్వరగానే ఇంటి నుంచి బయటకు వచ్చేశారు.
టీవీ9 పాత.. కొత్త యాజమాన్య గొడవల్లో బలైన జర్నలిస్టుల్లో జాఫర్ ఒకడన్న మాట వినిపిస్తూ ఉంటుంది. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు అత్యంత సన్నిహితుడైన జాఫర్.. రవితో భేటీ అయ్యారన్న కారణంగా ఆయన్ను తొలగించినట్లుగా చెబుతారు. అదేం కాదు.. సంస్థతో తనకున్న భావోద్వేగ సంబంధం మిస్ కావటంతోనే తాను జాబ్ కు రిజైన్ చేసినట్లు జాఫర్ తన సన్నిహితులతో చెప్పినట్లుగా చెబుతారు.
ఇదిలా ఉంటే.. టీవీ9 జాబ్ కు రిజైన్ చేసిన ఆయన తాజాగా టీవీ5లో చేరినట్లు తెలుస్తోంది. కొంతకాలం ఖాళీగా ఉన్న ఆయన.. రవిప్రకాశ్ స్టార్ట్ చేయనున్న కొత్త చానల్ లో పని చేస్తారని చెప్పినా.. ఇటీవల వేర్వేరుకేసుల్లో జైల్లో ఉన్న నేపథ్యంలో.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన టీవీ5లో చేరక తప్పలేదంటున్నారు. చక్కటి జీతంతో పాటు.. సంస్థలో గౌరవనీయమైన స్థానాన్ని ఇస్తామన్న హామీతో ఆయన టీవీ5లో చేరినట్లు తెలుస్తోంది. ప్రత్యేక ఇంటర్వ్యూలను జాఫర్ చేత చేయిస్తారని చెబుతున్నారు. ఆయన తాజా ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి.