Begin typing your search above and press return to search.

ఆ మీడియా సంస్థ ముందే చెప్పిందా?

By:  Tupaki Desk   |   25 Nov 2015 10:44 AM IST
ఆ మీడియా సంస్థ ముందే చెప్పిందా?
X
వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి తెర మీదకు వచ్చింది. వరంగల్ ఉప ఎన్నిక ఫలితం ఏ తీరులో ఉంటుందో ప్రముఖ మీడియా సంస్థ టీవీ 9 పక్కాగా అంచనా వేసిందా? అంటే అవుననే చెబుతున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ చారిత్రక విజయాన్ని సాధిస్తుందన్న మాటను చాలా ముందే స్పష్టంగా చెప్పినట్లుగా చెబుతున్నారు. అదెలానంటే..

వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత టీవీ9 పేరు మీద వాట్స్ ప్ లలో ఒక మెసేజ్ హడావుడి చేసింది. అయితే.. దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే.. టీవీ 9 తనకు తానుగా వరంగల్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందన్న విషయాన్న అధికారికంగా వెల్లడించకపోవటమే. ఇక.. వాట్సప్ లో హడావుడి చేసిన మెసేజ్ ను చూస్తే.. వరంగల్ ఉప ఎన్నిక ఫలితం వన్ సైడ్ గా ఉంటుందని.. తెలంగాణ అధికారపక్షానికి తిరుగులేని అధిక్యత ఖాయమన్న మాటను చెప్పేసింది.

వరంగల్ లోక్ సభా స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరకాల మినహా.. మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో 80 శాతం వరకు ఓట్లు టీఆర్ ఎస్ కు మాత్రమే పోల్ అవుతాయన్న విషయాన్ని సదరు మెసేజ్ లో పేర్కొన్నారు. పోటాపోటీగా జరిగిందని భావిస్తున్న ఉప ఎన్నిక నేపథ్యంలో భారీ మెజార్టీ రావటం సాధ్యం కాదన్న భావనతో ఎవరూ దీని గురించి పెద్దగా చర్చించలేదు. కానీ.. ఎవరూ ఊహించని విధంగా టీవీ9 పేరు మీద హడావుడి చేసి మెసేజ్ లోని అంశాలు అక్షరసత్యమై.. భారీ మెజార్టీని తెలంగాణ అధికారపక్షం సాధించింది.