Begin typing your search above and press return to search.

ర‌విప్ర‌కాశ్ రూటు!... రాజీనా? ర‌ణ‌మేనా?

By:  Tupaki Desk   |   13 May 2019 11:30 PM GMT
ర‌విప్ర‌కాశ్ రూటు!... రాజీనా? ర‌ణ‌మేనా?
X
టీవీ 9 వ్య‌వ‌స్థాప‌కుడు - ఆ టీవీకి 15 ఏళ్ల పాటు సీఈఓగా కొన‌సాగిన ర‌విప్ర‌కాశ్ వ్య‌వ‌హారంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. టీవీ 9ను ఇంత‌టి స్థాయికి తీసుక‌కొచ్చిన ర‌విప్ర‌కాశ్ ఆ సంస్థ నుంచి అత్యంత అవ‌మాన‌క‌ర రీతిలో బ‌య‌ట‌కు వ‌చ్చేయాల్సి వ‌చ్చింది. తానేం చేసినా జ‌రిగిపోతుందిలే అన్న ర‌విప్ర‌కాశ్ నైజ‌మే ఈ ప‌రిణామాల‌కు కార‌ణ‌మ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. టీవీ 9 ఛానెల్ యాజ‌మాన్యం మారినా కూడా త‌న మాటే చెల్లుబాటు కావాల‌న్న రీతిలో వ్య‌వ‌హ‌రించిన ర‌విప్ర‌కాశ్.. కొత్త యాజమాన్యం బాసుల మూలాల‌ను మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి. ఓ ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ర‌విప్ర‌కాశ్ ను టీవీ 9 నుంచి బ‌య‌ట‌కు పంపేయ‌డంతో పాటుగా ఆ ఛానెల్ ను కూడా త‌నకు అనుకూలంగా మ‌లచుకునే రీతిలోనే రూపుదిద్దుకున్న‌ పొలిటిక‌ల్ ప్లాన్‌ ను ర‌విప్ర‌కాశ్ అంచ‌నా వేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

స‌రే... జరిగిందంతా గ‌తం అనుకుంటే.. మ‌రి ర‌విప్ర‌కాశ్ ఫ్యూచ‌ర్ ఏమిట‌న్న దానిపై ఇప్పుడు లెక్క‌లేన‌న్ని విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. త‌న మోజో టీవీని మ‌రింత‌గా విస్త‌రిస్తార‌ని - ఐ న్యూస్ ను టేకోవ‌ర్ చేస్తార‌ని కొన్ని వాద‌న‌లు - రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఆధ్వ‌ర్యంలోని న్యూస్ 18ల‌తో చేరి - అదే పేరిట తెలుగులోనూ ఓ న్యూస్ ఛానెల్ ను ఆయ‌న ప్రారంభిస్తార‌ని మ‌రికొన్ని విశ్లేష‌ణ‌లు సాగాయి. ఈ క్ర‌మంలో రిల‌య‌న్స్ యాజ‌మాన్యంతో చ‌ర్చ‌ల కోస‌మే ఆయ‌న ముంబై వెళ్లార‌ని కూడా వార్త‌లు వినిపించాయి. అయితే ఈ వార్త‌ల‌పై ఇప్ప‌టిదాకా స్ప‌ష్ట‌త రాలేద‌నే చెప్పాలి. ఇదిలా ఉంటే...విచార‌ణ‌కు హాజ‌రుకాని ర‌విప్రకాశ్ ను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు ఏకంగా ప్ర‌త్యేక బృందాల‌నే రంగంలోకి దింపిన‌ట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడు ర‌విప్ర‌కాశ్ ప‌రిస్థితి ముందు నొయ్యి - వెనుక గొయ్యిలా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ క్ర‌మంలోనే ర‌విప్ర‌కాశ్ ఫ్యూచ‌ర్ ప్లాన్ల‌కు సంబంధించి ఇప్పుడు ఓ రెండు విశ్లేష‌ణ‌లు బలంగా వినిపిస్తున్నాయి. అందులో మొద‌టిది... ఇదంతా ఎందుకొచ్చిన గోల అని భావిస్తున్న ర‌విప్ర‌కాశ్ అలంద మీడియాతో రాజీకి య‌త్నిస్తున్నార‌ట‌. ఇందుకోసం ఆయ‌న ఓ ప్ర‌ముఖుడిని ఆశ్ర‌యించార‌ని - ఆ దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని కూడా ఈ విశ్లేష‌ణ సాగింది. ఇక రెండో విశ్లేష‌ణ‌కు వ‌స్తే.. తాను స్థాపించిన టీవీ 9 లో నుంచి త‌న‌నే బ‌య‌ట‌కు గెంటేస్తారా? అంటూ ఇప్ప‌టికీ అగ్గి ఫైర్ అవుతున్న ర‌విప్ర‌కాశ్... అలంద‌తో రాజీ స‌మ‌స్యే లేద‌ని చెబుతున్నార‌ట‌. త‌న‌ను అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో బ‌య‌ట‌కు పంపిన వైనంపై న్యాయ‌పోరాటం చేసేందుకే ఆయ‌న నిర్ణయించుకున్నట్లు ఈ విశ్లేష‌ణ చెబుతోంది. ఇందుకు గాను ఆయ‌న పూర్తి స్థాయిలో స‌న్న‌ద్ధ‌మ‌య్యేందుకే కొంత‌కాలం పాటు క‌నిపించ‌కుండా పోయార‌ని కూడా తెలుస్తోంది. ర‌విప్ర‌కాశ్ ఏం చేస్తారో తెలియ‌దు గానీ.. ఆయ‌న నెక్ట్స్ ప్లాన్ల‌పై ఇలా ఎవ‌రికి తోచిన రీతిలో వారు విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు.