Begin typing your search above and press return to search.
రవిప్రకాశ్ ట్విస్ట్!... టీవీ 9 తెరపై ప్రత్యక్ష్యం!
By: Tupaki Desk | 9 May 2019 2:42 PM GMTఉదయం నుంచి ఒకటే గోల. తెలుగు న్యూస్ ఛానెళ్లలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న టీవీ 9లో ఏదో జరుగుతోందని - ఆ టీవీని అంతెత్తుకు ఎదిగేలా చేసిన సీఈఓ రవిప్రకాశ్ పై కేసు - ఆయన పాస్ పోర్టు సీజ్ - ఇంటిలో సోదాలు - సీఈఓ పదవి నుంచి ఆయననున తొలగిస్తున్నట్లుగా జరిగిన ప్రచారం - ఆయన కోసం గాలిస్తున్న పోలీసులు - ఏ క్షణాన్నైనా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఇక రవిప్రకాశ్ కెరీర్ ముగిసినట్టేనన్న విశ్లేషణలూ సాగాయి. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ రవి ప్రకాశ్... రాత్రం 7 గంటలకు ముందే టీవీ 9 తెరపైనే ప్రత్యక్షమైపోయారు.
రోజూ 9పీఎం విత్ రవిప్రకాశ్ పేరిట ప్రసారమయ్యే బులెటిన్ లో కనిపించే రవిప్రకాశ్... నేడు మాత్రం సరిగ్గా రాత్రి 6.47 గంటలకు అకస్మాత్తుగా ప్రత్యక్షమైపోయారు. కేవలం తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకే వచ్చినట్టుగా కనిపించిన రవిప్రకాశ్... వచ్చీరాగానే అదే మాటను చెప్పేశారు. మొత్తంగా ఉదయం నుంచి తనపైనా, టీవీ 9 పైనా జరుగుతున్న రచ్చకు రవిప్రకాశ్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు.
ఈ సందర్భంగా రవి ప్రకాశ్ ఏం చెప్పారన్న విషయానికి వస్తే... *నాపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు. అభిమానులు - టీవీ9 ప్రేక్షకులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈనెల 16న ఎన్ సీఎల్టీ కోర్టులో కేసు విచారణ జరగనుంది. ఆ కేసు ఆధారంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు. నేను అజ్ఞాతంలోకి వెళ్లాననడం అవాస్తవం. మొన్న టీవీ9లోనే బులెటిన్ చేశాను. ఉదయం నుంచి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న టీవీ చానెళ్లకు ధన్యవాదాలు. నన్నెవరూ అరెస్ట్ చేయలేదు.. చేయబోవడం లేదు. నిజం చెప్పులు వేసుకునేలోగా అబద్ధం ప్రపంచం చుట్టి వస్తుంది. నేను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ టీవీ9 స్టూడియో నుంచే మాట్లాడుతున్నాను* అని రవిప్రకాష్ స్పష్టం చేశారు. మరి ఉదయం నుంచి జరిగిన ప్రచారం మాటేమిటో అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.