Begin typing your search above and press return to search.

టీవీ9 ఉద్యోగుల మ‌న‌సు ముక్క‌లైంద‌ట‌!

By:  Tupaki Desk   |   17 May 2019 8:51 AM GMT
టీవీ9 ఉద్యోగుల మ‌న‌సు ముక్క‌లైంద‌ట‌!
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌రిచ‌యం చేయాల్సిన మీడియా ప్ర‌ముఖుడి పేరు ర‌విప్ర‌కాశ్‌. మొన్న‌టివ‌ర‌కు ఆయ‌న పేరు ముందు టీవీ9 సీఈవో అన్న పేరుతో పాటు.. స‌ద‌రు ఛాన‌ల్ వ్య‌వ‌స్థాప‌క స‌మ్ థింగ్.. స‌మ్ థింగ్ ఉండేది. ఆయ‌నంటే ఆ ఛాన‌ల్లో ప‌ని చేసే వారికి విప‌రీత‌మైన ఆడ్మైరింగ్‌. ఆయ‌న్ను స్ఫూర్తిగా తీసుకున్నోళ్లు బోలెడంత మంది క‌నిపిస్తారు.అలాంటి ఆయ‌న మీద మోసం.. ఫోర్జ‌రీ.. ఇంకా ర‌క‌ర‌కాల సెక్ష‌న్లు.. ప‌లు ర‌కాల విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు రావ‌టం.. ఆయ‌న క‌నిపించ‌కుండా పోవ‌టం జ‌రిగిపోయాయి.

ఇంత జ‌రిగినా.. మీడియాలో ర‌విప్రకాశ్ కు ఎలాంటి ద‌న్ను ల‌భించ‌లేదు. చివ‌ర‌కు సోష‌ల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆయ‌న వైపు ఉండి.. ఆయ‌న త‌ర‌ఫున మాట్లాడే ఒక్క‌రు కూడా క‌నిపించ‌లేదు. సింగిల్ పోస్ట్ క‌నిపించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. త‌మ సారు సుద్ద‌పూస‌గా ఫీలైనోళ్లు ఎవ‌రైనా ఉన్నారంటే.. టీవీ9 ఉద్యోగులుగా చెబుతారు.

ఎవ‌రేం చెప్పినా.. ఎవ‌రేం అన్నా త‌మకు మాత్రం త‌మ సార్ మీద అభిమానం పోద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేవారు. అలాంటి వారు.. ఇవాల్టి నుంచి త‌మ మ‌న‌సులు ముక్క‌లైన‌ట్లుగా పెద్ద ఎత్తున వాపోతున్నారు. టీవీ9 లోగోతో పాటు.. మ‌రో ఐదు లోగోల్ని ర‌విప్రకాష్ సొంత సంస్థ అయిన మోజోకు రూ.99వేల‌కు అమ్మిన వైనాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఈ విష‌యంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు రావ‌టం.. అందుకు త‌గ్గ ఎవిడెన్స్ బ‌య‌ట‌కు రావ‌టంతో అవాక్కు అవుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ తామంతా ఆయ‌న విష‌యంలో సానుకూలంగా ఉన్నాం కానీ.. ఈ రోజు నుంచి ఉండ‌లేమ‌న్న మాట టీవీ9 ఉద్యోగుల్లో వినిపిస్తోంది. మెజార్టీ వాటాదారుల‌కు మాట మాత్రం చెప్ప‌కుండా టీవీ9 లోగోను రూ.99వేల‌కు అమ్ముకోవ‌టం ఏమిటి? అలా అమ్మిన డ‌బ్బుల్ని నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల కింద చూపించ‌టం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌ల్ని సంధిస్తున్నారు. మాన‌సికంగా త‌మ సార్ తో త‌మ‌కున్న అటాచ్ మెంట్.. తాజా ఇష్యూతో తెగిపోయింద‌ని చెబుతున్నారు. చూస్తుంటే ఆరు లోగోల‌ను రూ.99వేల‌కు అమ్మిన వైనం టీవీ9ఉద్యోగుల్ని భారీగా హ‌ర్ట్ చేసిన‌ట్లుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.