Begin typing your search above and press return to search.
టీవీ9 రవిప్రకాశ్... ఐ న్యూస్ రవి ప్రకాశ్ అవుతారా?
By: Tupaki Desk | 11 May 2019 11:41 AM GMTటీవీ9 నుంచి రవిప్రకాశ్ చాలా అవమానకరమైన రీతిలో బయటకు వచ్చేశారు. యాజమాన్యం మారినా... తనదైన శైలిలో ఆ ఛానెల్ పై పట్టు సాధించేందుకు సినీ నటుడు శివాజీతో కలిసి నానా కుట్రలు పన్నారని ఆ ఛానెల్ కొత్త యాజమాన్యం రవిప్రకాశ్ పై సంచలన ఆరోపణలు చేయడమే కాకుండా ఏకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఇక నిన్న మీడియా మీట్ పెట్టి మరీ రవి ప్రకాశ్ ను తమ సంస్థలో సీఈఓ పదవి నుంచి తొలగించడమే కాకుండా డైరెక్టర్ పదవి నుంచి కూడా తప్పిస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేసింది. మొత్తంగా ఇప్పుడు తాను పెంచి పోషించిన టీవీ 9లో తానే అడుగుపెట్టలేని పరిస్థితి రవిప్రకాశ్ ది.
మీడియా రంగంలో ఓ సక్సెస్ ఫుల్ ఎంటర్ ప్రెన్యూర్ గా సత్తా చాటిన రవిప్రకాశ్... టీవీ9 కొత్త యాజమాన్యం కొట్టిన దెబ్బకు చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చుంటారా? సమస్యే లేదట. తనకు దెబ్బ కొట్టన టీవీ9కు తానేంటో చూపించాలన్న కసితో రవిప్రకాశ్ ఇప్పటికే తన ప్లాన్ బీని అమలు చేసేందుకు రంగంలోకి దిగిపోయినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో టీవీ9కు మంచి పోటీదారుగానే ఎంట్రీ ఇచ్చిన ఐ న్యూస్ ఛానెల్ గుర్తుందా? ఇప్పటికీ సదరు ఛానెల్ కొనసాగుతున్నా... పెద్దగా ఆకట్టుకునే రీతిలో సాగడం లేదు. ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా వ్యవహరించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, ప్రస్తుతం టీడీపీ నేతగా, చిత్తూరు జిల్లా పీలేరు టీడీపీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసిన నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి చేతిలో ఆ ఛానెల్ ఉంది.
మౌలిక వసతులు, ఎక్విప్ మెంట్ విషయంలో ఏ ఒక్క ఛానెల్ కు తీసిపోని రీతిలోనే ఉన్న ఐ న్యూస్ ను టేకోవర్ చేసే దిశగా రవిప్రకాశ్ సాగుతున్నారట. దాని యజమాని టీడీపీ నేతే అయిన నేపథ్యంలో... టీడీపీతో ఇప్పటికీ మంచి సంబంధాలు కలిగి ఉన్న రవిప్రకాశ్ కు దానిని టేకోవర్ చేయడం పెద్ద సమస్యేమీ కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే... టీవీ9 కు సమీప భవిష్యత్తులోనే ఐ న్యూస్ రూపంలో ఓ మంచి ప్రత్యర్థి వచ్చినట్టేనన్న మాట. అదే జరిగితే... ఇప్పటిదాకా టీవీ 9 రవిప్రకాశ్ గా పిలిపించుకున్న రవిప్రకాశ్ ఇకపై ఐ న్యూస్ ప్రకాశ్ గా మారిపోతారన్న మాట. చూద్దాం... ఏం జరుగుతుందో?