Begin typing your search above and press return to search.

ఛాన్స్ ల‌న్ని ఓవ‌ర్.. అరెస్ట్ మాత్ర‌మే బ్యాలెన్స్!

By:  Tupaki Desk   |   18 May 2019 4:31 AM GMT
ఛాన్స్ ల‌న్ని ఓవ‌ర్.. అరెస్ట్ మాత్ర‌మే బ్యాలెన్స్!
X
మోసం.. ఫోర్జ‌రీతో పాటు ఇత‌ర నేరారోప‌ణ‌ల నేప‌థ్యంలో టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ పోలీసుల ఎదుట హాజ‌రు కాని విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మూడుసార్లు నోటీసులు ఇచ్చిన‌ప్పటికి పోలీసుల ఎదుట ఆయ‌న అటెండ్ కాలేదు. రోజులు గ‌డుస్తున్న కొద్దీ చ‌ట్ట‌ప్ర‌కారం ఆయ‌న‌కు వ‌చ్చే వెసులుబాట్లు మూసుకుపోతున్న‌ట్లుగా పోలీసు వ‌ర్గాలు చెబుతున్నాయి.

అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు సంబంధించిన స‌రికొత్త నేరారోప‌ణ‌లు తెర మీద‌కు వ‌స్తున్నాయి. మొద‌ట చేసిన ఫిర్యాదుల‌తో పోలిస్తే.. తాజాగా తెర మీద‌కు వ‌చ్చిన లోగోల అమ్మ‌కం ర‌విప్ర‌కాశ్ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసింద‌ని చెప్పాలి. టీవీ9 లోగోతో పాటు మ‌రో ఐదులోగోల్ని త‌న సొంత సంస్థ అయిన మోజో టీవీకి కేవ‌లం రూ.99వేల‌కు అమ్మేసిన తీరుతో ర‌విప్ర‌కాశ్ ఏమిట‌న్న విష‌యంపై చాలామందికి క్లారిటీ వ‌చ్చేసింద‌ని చెబుతున్నారు.

వ‌రుస పెట్టి నేరారోప‌ణ‌లు తెర మీద‌కు రావ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న‌కు ఇస్తున్న నోటీసులు పెరుగుతున్నా.. ఆయ‌న నుంచి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌టంపై పోలీసు వ‌ర్గాలు గుర్రుగా ఉన్నాయి. వ‌రుస పెట్టి త‌ప్పులు చేస్తున్న‌ట్లుగా పోలీసు అధికారులు చెబుతున్నారు. ఎంత ఎక్కువ‌గా పోలీసుల నుంచి త‌ప్పించుకోవాల‌ని చూస్తే.. అంత త్వ‌ర‌గా పోలీసుల అదుపులోకి ఆయ‌న రావ‌టం ఖాయ‌మ‌న్న మాట కొంద‌రు సీనియ‌ర్ అధికారుల నోట రావ‌టం గ‌మ‌నార్హం.

ర‌విప్ర‌కాశ్ కు ఇచ్చిన ఛాన్సుల్ని ఆయ‌న సద్వినియోగం చేసుకోలేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. సీవోవో మూర్తి ప‌లుమార్లు విచార‌ణ‌కు వెళ్లినా ఆయ‌న్ను అదుపులోకి తీసుకోక‌పోవ‌టాన్ని గుర్తు చేస్తున్న అధికారులు.. త‌న వైఖ‌రితో ర‌విప్ర‌కాశ్ ఇష్యూను మ‌రింత కాంప్లికేట్ చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న‌కు చ‌ట్ట‌ప‌రంగా ఉన్న ఛాన్సుల‌న్ని పూర్తి అయిపోతున్నాయ‌ని.. ఆయ‌న అరెస్ట్ మాత్ర‌మే మిగిలిన‌ట్లుగా తెలుస్తోంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న అరెస్ట్ ఏ క్ష‌ణంలో అయినా జరిగే అవ‌కాశం ఉంద‌ని.. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ వెలువ‌డ‌టం ప‌క్కా అని చెబుతున్నారు.