Begin typing your search above and press return to search.

ట్వీట్లు - రీట్వీట్లు చేసేది మ‌నుషులు కాదు.. ట్రెండింగ్ ర‌హాస్యం ఇదే..

By:  Tupaki Desk   |   25 May 2020 11:30 PM GMT
ట్వీట్లు - రీట్వీట్లు చేసేది మ‌నుషులు కాదు.. ట్రెండింగ్ ర‌హాస్యం ఇదే..
X
ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘రీ ఓపెన్‌ అమెరికా’ ఉద్యమం తీవ్రంగా ఉంది. ఆ దేశంలో ఈ ఉద్య‌మం తీవ్రంగా ప్ర‌బ‌లుతోంది. ‘రీ ఓపెన్‌ అమెరికా’ పేరిట ఉద్యమం కొన‌సాగుతోంది. ఆ ఉద్య‌మం ఎందుకంటే మ‌హ‌మ్మారి వైరస్‌తో ఆ దేశంలో కొన్ని రంగాల‌పై ఆంక్ష‌లు విధించారు. ప‌రోక్షంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. అయితే దీన్ని కొంద‌రు అమెరికన్లు వ్య‌తిరేకిస్తున్నారు. ఆంక్ష‌లు ఎత్తివేయాల‌ని కోరుతూ అమెరికా తిరిగి తెరుచుకోవాల‌ని అంటూ రీ ఓపెన్ అమెరికా అంటూ సోష‌ల్ మీడియాలో ఉద్య‌మం న‌డిపిస్తున్నారు. మ‌రి ముఖ్యంగా ట్విటర్‌లో ఇది కొన‌సాగుతోంది. వీటిపై భారీగా ట్వీట్లు, రీ ట్వీట్లు, కామెంట్స్ వ‌స్తున్నాయి. ఈ ఉద్య‌మంపై ఓ సంస్థ అధ్య‌యనం చేసింది. ఈ స‌మ‌యంలోనే ఊహించ‌ని ఒక విష‌యం తెలిసింది. ఆ ట్వీట్లు, రీ ట్వీట్లు చేసేది మ‌నుషులు కాద‌ట‌. అదంత‌క‌దే ట్వీట్లు, రీట్వీట్లు అవుతున్నాయ‌ని గుర్తించారు. అంటే అకౌంట్లలో సగానికిపైగా ఖాతాలు ఆటోమేటెడ్‌ బాట్స్‌కు చెందినవని పరిశోధకులు చెబుతున్నారు. ట్విటర్‌ బాట్స్‌ ద్వారా ఆ ఉద్య‌మం తీవ్ర‌మైంద‌ని కార్నెజీ మెలన్‌ యూనివర్సిటీ తెలిపింది. దాదాపు 200 మిలియన్ల ట్వీట్ల చర్చలను పరిశీలించగా.. 82 శాతం టాప్‌ 50 ప్రేరేపిత ట్వీటర్లు.. 62 శాతం టాప్ వెయ్యి రీ ట్వీటర్లను బాట్స్‌గా గుర్తించింది. మనుషులకు చెందిన ఆ ఖాతాలు బాట్‌ సహాయంతో 66 శాతం ట్వీట్లు చేయబడ్డాయని ప‌రిశోధ‌కులు గుర్తించారు.

బ్యాట్స్‌కు ఓ అర్థం లేదు. కంప్యూటర్‌ ద్వారా రూపొందించబడిన సాఫ్ట్‌‌వేర్‌ ప్రోగ్రామ్‌ను బాట్స్‌గా పేర్కొంటారు. మనిషి సహాయం లేకుండా ఆటోమేటిక్‌గా ట్వీట్లను, రీట్వీట్లను చేస్తుంది. దీని ప్రకారం ఓ మనిషి కొన్ని వేల ట్విటర్‌ ఆకౌంట్లను కంట్రోల్‌ చేయగలడు. ఇలాంటి విధానం చాలా దేశాలు విరివిగా ట్విటర్‌ బాట్స్‌ను ఉపయోగిస్తున్నాయని ఆ విశ్వ‌విద్యాల‌యం తెలిపింది. రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో ఇది కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని గుర్తుచేసింది. ఇప్పుడు రీ ఓపెనింగ్‌ అమెరికా ఉద్య‌మంలోనూ బ్యాట్స్ ఉంద‌ని వెల్ల‌డించింది.

అంటే ట్విట‌ర్‌లో ట్రెండింగ్‌గా.. సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ఉండేలా ఈ బ్యాట్స్‌ను సంస్థ‌లు, వ్య‌క్తులు, పార్టీలు వినియోగిస్తున్నాయి. ఇన్నాళ్లు ట్రెండింగ్ సాగిన అంశాల్లో కూడా ఇదే ఉంద‌ని తెలుస్తోంది. అంటే మ‌నుషులతో ప‌ని లేకుండా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచేందుకు ఈ బ్యాట్స్ ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. భ‌విష్య‌త్‌లో వీటి ప్ర‌యోగం విస్తృతంగా మార‌నుంది. అయితే ఇది కొన్ని దుష్ప్ర‌చారాల‌కు కూడా ఉప‌యోగ‌ప‌డే ప్ర‌మాదం ఉంది. త‌ప్పుదోవ ప‌డితే స‌మాజానికే ప్ర‌మాద‌మ‌ని కొంద‌రు సాఫ్ట్‌వేర్ విశ్లేష‌కులు, ఐటీ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.