Begin typing your search above and press return to search.
జేఎన్.యూ కొత్త వీసీ శాంతిశ్రీ పేరిట ట్వీట్ల కలకలం
By: Tupaki Desk | 9 Feb 2022 3:30 PM GMTదేశంలోనే ప్రతిష్టాత్మక 'జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం' కొత్త వైస్ చాన్సలర్ గా నియమితులైన ఫ్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ఆదిలోనే వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రస్తుతం విమర్శలకు కేంద్రబిందువుగా మారారు. ఆమె ఇదివరకూ చేసిన పాత ట్వీట్లను బయటకు తీసిన నెటిజన్లు ఆమెను ముస్లిం వ్యతిరేకిగా.. హిందుత్వవాదిగా సోషల్ మీడియాలో ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే శాంతిశ్రీ నియామకాన్ని బీజేపీకే చెందిన లోక్ సభ ఎంపీ వరుణ్ గాంధీ సైతం తప్పు పట్టారు.
జే.ఎన్.యూ వైస్ చాన్సలర్ గా ఇటీవలే శాంతిశ్రీ ధూళిపూడి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకూ వీసీగా పనిచేసిన ఎం జగదీష్ కుమార్.. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్ గా అపాయింట్ అయ్యారు. ఆయన ఖాళీ చేసిన స్థానాన్ని ప్రొఫెసర్ శాంతి శ్రీ ధూళిపూడి పండిట్ తో కేంద్రప్రభుత్వం భర్తీ చేసింది. ఈమె ఐదేళ్ల పాటు జే.ఎన్.యూ వీసీగా కొనసాగుతారు.
జే.ఎన్.యూ వీసీగా నియమితురాలైన తొలి మహిళ శాంతిశ్రీ. ఈమె రష్యాలో జన్మించారు. చెన్నైలో చదువుకున్నారు. తెలుగు మూలాలున్నా కుటుంబం ఆమెది. తెలుగు సహా తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉంది. కన్నడ, మలయాళం, కొంకణి భాషలపై పట్టు ఉంది. మహారాష్ట్రలోని సావిత్రిభాయి ఫులే యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేశారు. జేఎన్.యూ పూర్వ విద్యార్థి. ఎంఫిల్,పీహెచ్.డీ పూర్తి చేశారు.
జే.ఎన్.యూ వీసీగా నియమితులైన శాంతిశ్రీ గతంలో చేసిన ట్వీట్లను కొందరు నెటిజన్లు బయటకు తీసి తెగ విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని విమర్శిస్తూ 'విదేశీ వనిత' అని, ఇటాలియన్ రిమోట్ కంట్రోల్ అని విమర్శించిన శాంతిశ్రీ పేరిట ఉన్న ట్వీట్లను కొందరు వైరల్ చేస్తున్నారు. 'దేశంలో లవ్ జిహాద్ పెచ్చరిల్లిందని.. ఉగ్రవాదం కంటే ఇది అత్యంత ప్రమాదకరమైనదని.. ముస్లిమేతరులు మేల్కోవాలంటూ ఆమె ఇదివరకూ చేసిన ట్వీట్లు తాజాగా బయటకు తీశారు. జే.ఎన్,యూ,జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ సెయింట్ స్టెఫాన్ కళాశాలలను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో పలు కామెంట్స్ పోస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోకలే 'బియ్యం సంచుల కోసం మతమార్పిడికి కొందరు అంగీకరిస్తున్నారంటూ' శాంతిశ్రీ ధూళిపూడి వివాదాస్పద ట్వీట్లను చేశారని విమర్శించారు. అన్యమత ద్వేషిని అత్యున్నత యూనివర్సిటీకి వైస్ చాన్స్ లర్ గా నియమించడం సరికాదన్నారు.ఆ యూనివర్సిటీలో చదివే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండొచ్చో ఊహించుకోవచ్చని చెప్పారు.
-నాకు ట్విట్టర్ ఖాతా లేదు: ఆరోపణలు ఖండించిన జేఎన్.యూ కొత్త వీసీ శాంతిశ్రీ
గతంలో తాను చేసిన ట్వీట్లు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విష ప్రచారంపై జే.ఎన్.యూ వీసీ శాంతిశ్రీ స్పందించారు. తన పేరుతో ఎవరో ట్విట్టర్ ఖాతాను తెరిచి వివాదాస్పద ట్వీట్లు చేసి తన ఇమేజ్ కు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.
సోషల్ మీడియాలో తాను యాక్టివ్ గా ఉండనని.. ట్విట్టర్ అకౌంట్ అస్సలు మెయిన్ టెయిన్ చేయనని.. ఇది ఎవరో కావాలనే చేశారని.. ఓర్వలేని వారు చేసిన పని ఇది అంటూ శాంతిశ్రీ వ్యాఖ్యానించారు.
అయితే వివాదాస్పద ట్వీట్లు, స్క్రీన్ షాట్లు వైరల్ కావడంతో సోమవారం సాయంత్రం నాటికి శాంతిశ్రీ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ డీ యాక్టివేట్ కావడం చర్చనీయాంశమైంది. మరి ఈ ట్వీట్లు శాంతిశ్రీ గతంలో చేసిందా? ఆమె పేరిట ఎవరో సృష్టించారా? అన్నది తేలాల్సి ఉంది.కానీ శాంతిశ్రీ నియామకంతోనే ఆమెపై కొందరు నెగెటివ్ ప్రచారం చేయడం గమనార్హం.