Begin typing your search above and press return to search.
మోడీపై సోషల్ మీడియా ఏరియల్ వ్యూ
By: Tupaki Desk | 5 Dec 2015 10:03 AM GMTచెన్నై నగరంలో ఏరియల్ సర్వే చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోలను ఫొటో షాప్ లో మార్చేసి విడుదల చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో జరిగిన ఆ పొరపాటుకు క్షమాపణ చెప్పింది.. కానీ, సోషల్ మీడియా మాత్రం ఆ ఘటనను తేలిగ్గా తీసుకోలేదు. మోడీపై సెటైర్లు వేస్తూనే ఉంది. మోడీ ఏరియల్ సర్వేపై సెటైరిక్ ఫోటోషాపిక్ ఇమేజెస్ తో ట్విట్టర్ నిండిపోతోంది.
ట్విట్టర్ జనులు(ట్విట్టర్లో ఉన్నవారు) ఈ అంశంపై వేస్తున్న సెటైర్లు.. పెడుతున్న ఫొటోలు హైలీ క్రియేటివ్ గా ఉంటున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని..
- ఫ్రంటులోడ్ వాషింగ్ మిషన్ లో ఉతకడానికి వేసిన బట్టలను మోదీ తదేకంగా చూస్తున్నట్టుగా ఉన్న చిత్రం ఇప్పుడు ట్విట్టర్ లో అత్యధికంగా వ్యాపిస్తోంది.
- ఇండియా ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ ను మోడీ చూస్తున్నట్టు, బాబా రాందేవ్ యాడ్ ను చూస్తున్నట్టు, చీపురుపై సూపర్ మ్యాన్ లా వెళ్తున్న అరవింద్ కేజ్రీవాల్ ను చూస్తున్నట్లుగా ఉన్న చిత్రాలకు మంచి ఆదరణ కనిపిస్తోంది.
- మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారన్నట్లుగా సింబాలిక్ గా విమానం కిటికీలోంచి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తున్నట్లుగా ఓ చిత్రం పాపులర్ అయింది.
- తన తరఫున రిపోర్టింగ్ చేస్తున్న అనుపమ్ ఖేర్‌ను చూస్తున్నట్టు, ఓ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీరును గమనిస్తున్నట్టు, చెన్నైలో ఫొటో మార్ఫింగ్ ద్వారా వెలసిన అమ్మ బాహుబలి ఫొటోను తదేకంగా చూస్తున్నట్టు రకారకాలుగా చిత్రాలను మార్చి పోస్ట్ చేస్తుండడంతో పాటు వాటికి అదిరిపోయే కామెంట్లూ పెడుతున్నారు.