Begin typing your search above and press return to search.

బండ్ల వారి బ్లేడ్ భాగోతం పేరుతో ట్వీట్లతో ఒకటే హోరు

By:  Tupaki Desk   |   6 May 2020 6:00 AM GMT
బండ్ల వారి బ్లేడ్ భాగోతం పేరుతో ట్వీట్లతో ఒకటే హోరు
X
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు కమ్ మాజీ మంత్రి లోకేశ్ పై సినీ నిర్మాత కమ్ పార్ట్ టైం పొలిటీషియన్ గా పేరున్న బండ్ల గణేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. ట్వీట్లతో ఆయనపై ఘాటు విమర్శలు చేసిన బండ్ల మీద అంతకు మించి అన్నట్లుగా ఫైర్ అయ్యారు నాటి సినీ నటి..ప్రస్తుతం టీడీపీలో యమా యాక్టివ్ గా ఉన్న దివ్యవాణి. ఏ ట్వీట్లతో అయితే తమ చినబాబుపై బండ్ల ఫైర్ అయ్యారో.. అదే ట్వీట్లను అస్త్రంగా చేసుకొని ఓ రేంజ్లో ఉతికి ఆరేసే వ్యాఖ్యలు చేశారు.

దివ్యవాణి చేసిన ట్వీట్లకు వ్యాఖ్యలు.. వ్యాఖ్యానాలు చేయకుండా.. ఆమె పోస్టు చేసిన ట్వీట్లను యథాతధంగా చూస్తే.. ఏపీ రాజకీయం ఎంతలా మారిందో ఇట్టే అర్థమైపోతుంది.

‘‘అంతా బాగుందయ్యా బండ్ల. పెంటలాంటి నీ మీద రాయి వేయటం ఎందుకు అనుకున్నాం. కానీ.. నువ్వు టీడీపీని గబ్బు పట్టించిన రెడ్డి వేసిన పిడిగ్రీ తిని మొరుగుతున్నవాని అర్థమయ్యాక నీ బ్లేడు బాగోతం బయటపెట్టాల్సిందేనని ఈ రిప్లై ట్వీట్’’

‘‘ఎవరో ఒకరు పడేస్తారు. ఇలా గబ్బు రెడ్డి వేసిన ఎక్స్ పైరీ డేట్ దాటిన తిండి తిని పిచ్చెక్కినట్లు మొరగకు. ఎన్నికల ముందు వరకూ బ్లేడ్ బ్యాచ్ హెడ్డుగా ఉండే బండ్ల ట్వీటుకు నోటు తీసుకునే స్థాయికి దిగజారిపోవటమే ఓడలు బండ్ల అవ్వడమంటే’’

‘‘లోకేశ్‌ని చూసి భ‌యం వేయ‌డానికి నీలాగ న‌ర‌హంత‌కుడు న‌యీంతో క‌లిసి దందాలు చేయ‌లేదే! నీలాగ బ్లేడ్తో గొంతులు కోసే రకమూ కాదే! బండ్ల తమ్ముడు గొంతు కోసుకోవటానికి సెవనో క్లాక్ బ్లేడ్ కొనుక్కోవటానికి ఐదు రూపాయిలు లేకపోతే అడుక్కో’’

‘‘స్టాన్ ఫోర్డ్ లో చదవడమంటే ఎవడో బడాబాబుల సొమ్ముకు బినామీగా వ్యవహరించి సినిమా తీసి బడా ప్రొడ్యూసర్ అనిపించుకోవటం కాదు. మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవటమంటే.. నువ్వు సినిమా టికెట్ బ్లాక్ లో కొన్నట్టూ కాదు’’

‘‘చెక్ బౌన్సు కేసులు.. క్రిమినల్ గ్యాంగులతో సంబంధాలున్న బండ్ల గణేష్ కూడా కోట్స్ ట్వీట్ చేస్తున్నాడు. ఇదే కరోనా కాలం అంటే’’

‘‘లోకేశ్ మంత్రిగా నిర్వహించిన శాఖలకు అత్యదిక అవార్డులు వచ్చాయి. మీలాంటి క్రిమినల్స్ కి నచ్చే సీబీఐ.. ఈడీ కేసుల్లో ఏ1.. లిక్కర్ డాన్ జగన్ లాంటి నాయకుడిగా మా నారా లోకేశ్ ఎప్పటికి కాలేడు’’

‘‘పంచాయితీ రాజ్ శాఖామంత్రిగా లోకేశ్ పాతికవేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయించారు. దేశంలో తయారయ్యే ప్రతి పది సెల్ ఫోన్లలో మూడు ఫోన్లు ఏపీలో తయారవుతున్నాయంటే.. దటీజ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ లోకేశ్’’

‘‘ఉపాధి హామీలో దేశంలోనే అగ్రస్థానం ఆంధ్రప్రదేశ్ ది. గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రిగా లోకేశ్ సాధించిన రికార్డు. నువ్వో క్రిమినల్ వి అని నీపై కేసులు చెబుతున్నాయి. నీకు పదకొండు చార్జిషీట్లున్న రూ.43వేల కోట్ల గజదొంగ జగన్ ఆదర్శం కావటంలో తప్పు లేదు బండ్ల. మా లోకేశ్ పై ఒక్క అవినీతి కేసూ లేదు’’