Begin typing your search above and press return to search.
కరోనా మిగిల్చిన విషాదం.. కవల నర్సుల మృతి
By: Tupaki Desk | 26 April 2020 1:30 PM GMTకరోనా ఆ కవలలను చావులోనూ కబళించింది. కలిసే భూమ్మీదకు వచ్చిన వారిని కలిసే కరోనా కాటేసిన ఈ లోకం నుంచి పంపేసిన దైన్యం ఇంగ్లండ్ దేశంలో విషాదం నింపింది. ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ లో కవల అక్కాచెల్లెల్లు కరోనా వైరస్ బారిన పడి ఒకేసారి చనిపోయిన సంఘటన అత్యంత విషాదాన్ని నింపింది.
ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ జనరల్ హాస్పిటల్ లో కేటీ డేవిస్ (37), ఎమ్మా(37) కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. కరోనా టైంలో రోగులకు చికిత్సనందిస్తున్నారు. కొద్దిరోజులుగా ఎమ్మాకు కరోనా సోకి అనారోగ్యంతో చికిత్స పొందుతోంది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆమెకు సోదరి కేటీ డేవిస్ చికిత్సనందించింది.
ఎమ్మా ద్వారా డేవిస్ కు కూడా కరోనా వచ్చింది. దీంతో మూడు రోజుల వ్యవధిలో ఈ ఇద్దరూ కరోనా కారణంగా కన్నుమూయడం విషాదం నింపింది.
అయితే వీరిద్దరికీ అనారోగ్య సమస్యలున్నాయని.. వైరస్ కారణంగా అవి మరింత ముదిరి ఇద్దరినీ బలితీసుకున్నాయని నర్సుల కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా కాటుకు కవలల మరణంపై అందరూ కన్నీల్లు పెట్టుకున్నారు.