Begin typing your search above and press return to search.
ఆ బాలీవుడ్ హీరోనే కాదు..భార్యను మోడీ 'ఫాలో' అవుతారట!
By: Tupaki Desk | 24 April 2019 12:13 PM GMTకొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అదే పనిగా ప్రధాని మోడీని కలిసేందుకు తెగ ట్రై చేయటం.. పీఎంవో ఆయనకు అపాయింట్ మెంట్ కన్ఫర్మ్ చేయకపోవటం తెలిసిందే. అంతేనా.. కేరళలో ఒక కార్యక్రమానికి వెళ్లి.. అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లినప్పటికీ మోడీ మాష్టారు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటంతో నిరాశతో కేసీఆర్ హైదరాబాద్ తిరిగి రావటాన్ని మర్చిపోలేం. అయితే.. ఆ విషయాన్ని పెద్దగా ప్రచారం కాకుండా కవర్ చేసుకోవటం వేరే విషయం అనుకోండి.
ఇంతకీ.. అప్పటి విషయాన్ని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమిటంటే.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవటానికి.. ఐదారు నిమిషాలు ఆయనతో భేటీ కావటానికి కూడా మోడీకి టైం లేని పరిస్థితి. ఆ మాటకు వస్తే..ఇలాంటి అనుభవం ఒక్క కేసీఆర్ కు మాత్రమే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పలువురు అధినేతలకు ఎదురైన పరిస్థితి. తనకు నచ్చని వారిని కలిసేందుకు మోడీ ఇష్టపడరని చెబుతారు. దీంతో పాటు.. ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
అలాంటి వారు సోషల్ మీడియా కోసం టైం కేటాయించటం.. కొందరు ప్రముఖులు నిత్యం పెట్టే పోస్టుల్ని చూడటం..వారిని ఫాలో కావటం సాధ్యమయ్యే పనేనా? అంటే అవునని చెబుతున్నారు మోడీ. తొలిసారి నాన్ జర్నలిస్టు కమ్ బాలీవుడ్ సినీ నటుడు అక్షయ్ కుమార్ కు ప్రధాని ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వటం తెలిసిందే.
ఇంటర్వ్యూలో భాగంగా అక్షయ్ కుమార్ ను ఊహించని రీతిలో ఆట పట్టించారు మోడీ. మీ భార్య ఎప్పుడూ నన్ను తిడుతుంటారు కదా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. మిమ్మల్ని.. ట్వింకిల్ ఖన్నాజీని సోషల్ మీడియాలో ఫాలో అవుతాను. ఆమె నన్ను ఎలా టార్గెట్ చేస్తుంటారు? అన్న విషయాల్ని గమనిస్తూ ఉంటాను. మీ ఇంట్లో ట్వింకిల్ నా గురించి ప్రస్తావిస్తూ కేకలు వేస్తుంటారు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉంటారనుకుంటానని వ్యాఖ్యానించారు. గతంలో శానిటరీ న్యాప్ కిన్స్ రేట్లను భారీగా పెంచేస్తూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ట్వింకిల్ ఖన్నా తీవ్రంగానే మండిపడ్డారు. ఈ విషయంలో మోదీ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆమె ఘాటు కామెంట్లు కూడా చేశారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను అక్షయ్ ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్న మోదీ... నాటి విషయాన్ని ప్రస్తావించకుండానే... ట్వింకిల్ ఖన్నా... వచ్చిన కోపాన్నంతా తనపైనే చూపిస్తారని ఫన్నీ కామెంట్ చేశారు.
దేశ ప్రధాని తనది.. తన భార్య సోషల్ మీడియా ఖాతాను ఫాలో అవుతానన్న మాటకు అక్షయ్ ఖుషీ అయ్యారు. ఇక.. తన గురించి దేశ ప్రధాని మాట్లాడిన నేపథ్యంలో ట్వింకిల్ ఖన్నా రియాక్ట్ అయ్యారు. నేను మోడీజీ అన్న మాటల్ని పాజిటివ్ గా తీసుకుంటాను. నేనంటూ ఒకదాన్ని ఉన్నానని మోడీజీ గుర్తించటమే కాదు.. నా పనిని ఆయన గమనిస్తుంటారన్న విషయంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నిజమే.. దేశ ప్రధాని.. అందునా భారీ ఇమేజ్ ఉన్న మోడీ లాంటి వ్యక్తి ఒక బాలీవుడ్ కపుల్ గురించి ఇంత వివరంగా మాట్లాడితే.. ఆ సెలబ్రిటీలకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది? అంతా బాగానే ఉంది కానీ మోడీజీ.. మనలో మన మాట.. నిత్యం సోషల్ మీడియాను అదే పనిగా ఫాలో అయ్యేంత ఖాళీగా ఉంటారా? నిజం చెప్పండి?