Begin typing your search above and press return to search.
సీఎం కుర్చీ కోసం కుమారస్వామి-కాంగ్రెస్ కొట్లాట
By: Tupaki Desk | 20 May 2018 7:45 AM GMTబీజేపీని అధికారంలోకి రాకుండా చేశామన్న సంతోషం ఇంకా పూర్తిగా అనుభవించకుండానే కుమారస్వామికి కాంగ్రెస్ షాకిచ్చింది. సీఎం కుర్చీ నీకే అంటూ ఆఫరిచ్చి బీజేపీవైపు వెళ్లకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యడ్డీ కథ ముగిసిపోగానే అడ్డం తిరిగింది. రెండున్నరేళ్లు తమకు సీఎం సీటు కావాలని మెలిక పెట్టింది. దీంతో ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండానే కాంగ్రెస్ - జేడీఎస్ మధ్య పదవుల పంపకంలో తగాదాలు వచ్చాయి.
ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న విషయమై రెండు పార్టీ నేతల మధ్యా చర్చలు ప్రారంభం కాగా, రెండున్నరేళ్ల పాటు తమకు సీఎం పదవి ఇవ్వాలని కాంగ్రెస్ మెలిక పెట్టింది. దాంతోపాటు కీలకమైన హోమ్ - రెవెన్యూ తదితర శాఖలను కాంగ్రెస్ డిమాండ్ చేయగా - దానికి కుమారస్వామి ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన శివకుమార్ తో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ డిప్యూటీ సీఎం పదవి కోసం పోటీపడుతుండగా, శివకుమార్ కు ఆ పదవి ఇవ్వబోనని కుమారస్వామి తేల్చిచెప్పినట్లు సమాచారం.
ఈ పదవుల కేటాయింపు రెండు పార్టీలకూ తలనొప్పిగా మారడంతో దిల్లీ వెళ్లి - రాహుల్ - సోనియా సమక్షంలోనే తేల్చుకోవాలని కుమారస్వామి నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు ఆయన ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారని జేడీఎస్ వర్గాలు చెప్తున్నాయి..