Begin typing your search above and press return to search.
విజయవాడ రాహుల్ హత్య కేసులో ట్విస్ట్
By: Tupaki Desk | 20 Aug 2021 10:32 AM GMTఎవరినైనా అడ్డు తొలగించుకోవాలనుకుంటే ఆయన దగ్గరి వెళ్తే చాలు.. క్రైమ్ కు మారుపేరుగా ఆయన పేరే చెబుతారు.. కిరాతకానికి అడ్డాగా ఆయనుంటాడు.. ఆయన పేరు చెబితే కొందరు సినీ నటులు కూడా భయపడుతారట.. ఇంతకీ ఆయనెవరో తెలుసా..? కోగంటి సత్యనారాయణ అలియాస్ కోగంటి సత్యం. రౌడీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బెజవాడలో గ్రూపుల తగాదాలు తక్కువేం కాదు. ఇలాంటి గ్రూపుల్లో కోగంటి సత్యంది ఒకటి. మూడు దశాబ్దాలకు పైగా ఆయన పేరు నేర చరిత్రలో లిఖితమై ఉందంటే ఆయన ఎంతటి ఉద్దండడో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా మరోసారి కోగంటి సత్యం పేరు మారుమోగుతోంది. ఇటీవల విజయవాడలో ఓ యువ ఇంజనీర్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో కోగంటి సత్యం పేరు వినబడుతోంది.
కోగంటి సత్యం ఎవరు..? అయన చరిత్ర ఏందని తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్టు పెడుతున్నారు. 1985లో అప్పటి మంగళగిరి సర్పంచ్ ను కోగంటి సత్యం హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి సత్యం భూ కబ్జాలక పాల్పడుతూ, సెటిల్మెంట్లు చేస్తూ అక్రమ దందాలకు పాల్పడేవాడు. మంగళ గిరి నుంచి విజయవాడ కృష్ణ లంకకు మకాం మార్చిన కోగంటి ఎస్డీవీ స్టీల్స్ కంపెనీని ప్రారంభించాడు. ఓ వైపు వ్యాపార వేత్తగా ఉంటూనే మరోవైపు సెటిల్మెంట్ చేసే లీడర్ గా ఎదిగాడు. విజయవాడ మరో డాన్ వంగవీటి రంగా హత్య తరువాత కోగంటి సత్యం తన హవా సాగించాడు. ఎక్కడ చూసినా అప్పుడు కోగంటి పేరు పలికే వారు.
2008లో కాట్రగడ్డ బాబుపై కాల్పులు జరిపాడని కోగంటి సత్యంపే కేసు నమోదైంది. వాస్తవానికి కాట్రగడ్డ ప్లాన్ చేస్తే బతికి బయటపడడం అసాధ్యమంటారు. కానీ కాట్రగడ్డ తిరిగి కోగంటిపై అనేక హత్యకు ప్లాన్ వేసినా తప్పించుకున్నాడు. ఓసారి స్పైపర్ గన్ తో కాల్పులు జరిగాయి. అయినా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఓ ఫంక్షన్లోనూ ఆయనపై అటాక్ జరిగినా ఎవరికీ చిక్కలేదు.
2010లో కోగంటి సత్యంపై కోకా యాక్ట్ కింద కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆయనను నగర బహిష్కరణ చేశారు. భూవివాదంలో బోండా ఉమా, కోగంటి మధ్య జరిగిన కొన్నిగొడవల్లో అతనిపై కేసు నమోదైంది. ఇలా ఒకటి, రెండు కాకుండా కోగంటి సత్యంపై అనేక కేసులు నమోదయ్యాయి. అయినా కోగంట ఏదో విధంగా బయట హాయిగా తిరుగుతున్నాడు. తాజాగా ఆయన పేరు మరోసారి మారుమోగుతోంది.
ఇటీవల విజయవాడలో కారులో మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన రాహుల్ దిగా గుర్తించరు. కెనడాలో చదువు పూర్తి చేసుకున్న రాహుల్ కృష్ణ జిల్లా కొండూరు మండలం చెరువు మాధవరం లో సిలిండర్ల తయారీ కంపెనీని స్థాపించారు. ఇందులో ముగ్గురు భాగస్వాములున్నారు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో రాహుల్ బయటికి వెళ్లారు. ఆ తరువాత 9 గంటలకు ఇంట్లో వాళ్లు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది.
ఇంతలో మొగల్రాజపురంలో కారులో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు.పోలీసులు కారు అద్దాలు పగులగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే రాహుల్ మెడకు ఉరి తాడు బిగించి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. తెలిసిన వాళ్లే ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆర్థికక లావాదేవీల విషయంలో హత్య జరిగిందనే కోణంలో విచారిస్తున్నారు. ఈ తరుణంతో కోగంటి సత్యనారాయణ హస్తం ఉందా..? అని ప్రచారం సాగుతోంది. కొందరు వ్యక్తులు రాహుల్ ను అడ్డు తొలగించుకునేందకు కోగంటి సత్యం సహాయాన్ని తీసుకున్నారా..? అని అనుమానిస్తున్నారు.