Begin typing your search above and press return to search.

వివేకా కేసులో ట్విస్ట్‌.. త‌న‌కే ప్రాణ‌హాని ఉందంటున్న మ‌ణికంఠరెడ్డి!

By:  Tupaki Desk   |   15 Aug 2021 10:30 AM GMT
వివేకా కేసులో ట్విస్ట్‌.. త‌న‌కే ప్రాణ‌హాని ఉందంటున్న మ‌ణికంఠరెడ్డి!
X
మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత బాబాయి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి కేసులో ఊహించ‌ని మ‌లుపు చోటు చేసుకుంది. ఈ హ‌త్య జ‌రిగి రెండున్న‌రేళ్లు దాటిపోయిన త‌ర్వాత‌.. అనూహ్యంగా తెర‌మీద‌కి వ‌చ్చిన అనుమానిత పేర్ల‌లో కీల‌కంగా ఉన్న మ‌ణికంఠ‌రెడ్డిపై వివేకా కుమార్తె.. పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. త‌న తండ్రిని చంపిన‌ట్టుగా భావిస్తున్న అనుమానితుల‌కు మ‌ణికంఠ‌రెడ్డి అత్యంత స‌న్నిహితుడ ని.. ఆయ‌న వ‌ల్ల త‌న‌కు, త‌న కుటుంబానికి కూడా ప్రాణ‌హాని ఉంద‌ని ఆమె ఆరోపించారు. ఈ క్ర‌మంలో క‌డ‌ప ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేశారు.

ఆ వెంట‌నే స్పందించిన ఎస్పీ అన్బురాజ‌న్‌.. వివేకా ఇంటి వ‌ద్ద శాశ్వ‌త పికెట్ ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మం లో మ‌రోవైపు .. మ‌ణికంఠ రెడ్డిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అత‌నిపై బైండోవ‌ర్ కేసులు న‌మో దు చేశారు. నిజానికి ఈ హ‌త్య జ‌రిగి రెండున్న‌రేళ్లు పూర్త‌యినా.. ఇప్ప‌టి వ‌ర‌కు లేని మ‌ణికంఠ రెడ్డి తెర‌మీ దికి రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. మ‌రోవైపు.. త‌న‌కు వీరి వ‌ల్ల ప్రాణ‌హాని ఉందంటూ.. వివేకా కుమార్తె చెప్ప డం..ఆస‌క్తిగా మారింది. వివేకా కేసులో సీబీఐ ద‌ర్యాప్తు ప్రారంభ‌మైన ద‌రిమిలా.. ఒక్కొక్క రుగా అనేక మందిని విచార‌ణ చేయ‌డం ప్రారంభించారు. దీంతో పులివెందుల స‌హ‌.. జిల్లాలో రాజ‌కీయ వేడి రాజుకుంది.

ఈ క్ర‌మంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని .. అన్ని వ‌ర్గాల వారు.. ఉత్కంఠ‌గా ఉన్నారు. ఎందుకంటే.. మ‌రో నెల రోజుల్లోనే సీబీఐ విచార‌ణ ఒక కొలిక్కి వ‌స్తుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో.. ఎవ‌రు నిందితులుగా తేల‌తారో.. ఎవ‌రి పాత్ర ఉందోన‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ చ‌ర్చించుకుంటున్నారు. మ‌రోవైపు.. మ‌ళ్లీ క‌క్షా రాజ‌కీయాల‌కు.. హ‌త్య‌ల‌కు అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే త‌మ ఇంటి చుట్టూ.. రెక్కీ నిర్వ‌హించాడ‌ని.. తాను చూసే స‌రికి.. మ‌ళ్లీ ఎస్కేప్ అయ్యాడ‌ని.. పేర్కొంటూ.. వివేకా కుమార్తె సునీత‌.. పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో మ‌ణికంఠ‌ను పోలీసులు అరెస్టు చేయ‌డంతోపాటు బైండోవ‌ర్ కేసులు న‌మోదు చేశారు.

అయితే.. ఇక్క‌డ ట్విస్ట్ వెలుగు చూసింది. త‌న‌పై పెట్టిన కేసుల‌కు సంబంధించి మ‌ణికంఠ ఆస‌క్తికర విష‌యాలు చెప్పుకొచ్చాడు. తన ఫ్రెండ్ మ్యారేజ్‌కి రూమ్స్ కావాలని వివేకానందరెడ్డి ఇంటి పక్కన ఉన్న వారిని అడిగానని చెప్పుకొచ్చాడు. అయితే, వారు సునీతను అడగాలన్నారని, పెద్దవారిని అడగలేక వెనుదిరిగి వచ్చానని చెప్పాడు. అంతేతప్ప తనకు వేరే ఉద్దేశం లేదని మణికంఠ రెడ్డి స్పష్టం చేశాడు. తమవి చిన్న ప్రాణాలు అని, పెద్దలతో పెట్టుకునే అంత శక్తి తమకు లేదని వ్యాఖ్యానించాడు. ‘‘ఉదయం నుంచి పోలీస్ స్టేషన్, అరెస్ట్, బైండోవర్ కేసులు ఇవన్నీ చూస్తుంటే నాకు ప్రాణహాని ఉందని భయంగా ఉంది. నాకు రక్షణ కల్పించాలని పోలీసులను అడుగుతున్నాను.’’ అని మణికంఠ రెడ్డి పేర్కొన్నాడు. మ‌రి దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో.. వివేకా కుమార్తె ఎలాంటి క‌మెంట్లు చేస్తారో చూడాలి.