Begin typing your search above and press return to search.

థర్డ్ ఫ్రంట్ లో కాంగ్రెస్ తప్పనిసరి.. షాకిచ్చిన పవార్

By:  Tupaki Desk   |   26 Jun 2021 11:30 AM GMT
థర్డ్ ఫ్రంట్ లో కాంగ్రెస్ తప్పనిసరి.. షాకిచ్చిన పవార్
X
థర్డ్ ఫ్రంట్ అంటే అందరూ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫ్రంట్ అని అందరూ అనుకున్నారు. కానీ ఆ థర్డ్ ఫ్రంట్ లో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఉంటుందని ఎన్సీపీ అధినేత, థర్డ్ ఫ్రంట్ లో కీలకంగా ఉన్న శరద్ పవార్ బాంబు పేల్చారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్మాయం కాదని.. కాంగ్రెస్ తోనే థర్డ్ ఫ్రంట్ అని తేల్చారు.

కేవలం బీజేపీకి ప్రత్యామ్మాయంగా ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తే అందులో కాంగ్రెస్ ఉంటుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. బీజేపీని ఎదుర్కొనే ప్రత్యామ్మాయ ఫ్రంట్ కు కాంగ్రెస్ వంటి రాజకీయశక్తి అవసరం అని పవార్ పేర్కొన్నారు.

ఇటీవల కాంగ్రెస్ మినహా ఎనిమిది పార్టీల నేతలతో శరద్ పవార్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటి వెనుక ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారనివార్తలు వచ్చాయి. ఇది కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్మాయంగా దేశంలో మూడో ఫ్రంట్ అని చెప్పుకొచ్చారు. బీజేపీని గద్దెదించడమే ధ్యేయంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే శరద్ పవార్ స్పందించారు. తమ సమావేశంలో అసలు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపైనే చర్చ జరగలేదని.. ఒకవేళ థర్డ్ ఫ్రంట్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇటీవలే ‘మిషన్ 2024’ పేరుతో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కోవాలన్న లక్ష్యంతో దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ యేతర పక్షాలను ఏకం చేసే పనిని ఈ సమావేశం ద్వారా శరద్ పవార్ చేపట్టారు.. దీని వెనుక ఇటీవల శరద్ పవార్ ను కలిసి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్లాన్ ఉన్నట్టు చెబుతున్నారు.బీజేపీపై రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని .. బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలన్నింటిని థర్డ్ ఫ్రంట్ లోకి తీసుకోవాలన్న ధ్యేయంతో ఈ భేటి సాగిందనుకున్నారు. యశ్వంత్ సిన్హా కూడా టీఎంసీ తరుఫున కీలక పాత్ర పోషించారు.

దేశంలో ప్రస్తుతం అయితే బీజేపీ, లేదంటే కాంగ్రెస్ కేంద్రాలుగా రాజకీయం నడుస్తోంది. వీరికి ప్రత్యామ్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు చాలా రోజుల నుంచి విభిన్న రాజకీయ పార్టీల నేతలు ఒకవేదిక మీదకు వస్తున్నారు. అయితే ఇందులో కాంగ్రెస్ భాగమే అని శరద్ పవార్ తాజాగా ప్రకటించడం చర్చనీయాంశమైంది.