Begin typing your search above and press return to search.
రీల్ స్టోరీకి తీసిపోనన్న మలుపులు యాదమ్మ లైఫ్ లో
By: Tupaki Desk | 1 July 2022 4:09 AM GMTగూళ్ల యాదమ్మ.. రెండు రోజుల వరకు ఆమె ఎవరన్నది తెలంగాణలోని వారికి సైతం పెద్దగా పరిచయం లేదు. అలాంటి ఆమె పేరు ఇప్పుడు మారుమోగుతోంది. దీనికి కారణం.. ప్రధానమంత్రి మోడీకి ఆమె వంట చేసి పెట్టటమే. దేశ ప్రధానికి ఫైవ్ స్టార్ చెఫ్ లతో కాకుండా.. ఒక మహిళ చేసే వంటకాలతో విందు సిద్ధం చేయటం విశేషంగా మారటమే కాదు.. అలాంటి అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్న యాదమ్మ లైఫ్ స్టోరీ మీద చాలామందికి ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రధాని మోడీకి మెనూ సిద్ధం చేసిన ఆమె లైఫ్ ను చూస్తే.. బోలెడన్ని ట్విస్టులు.. అంతకు మించిన కష్టాలు.. పరీక్షలు కనిపిస్తాయి. అయితే.. వేటికి వెరవక నిజాయితీ.. క్రమశిక్షణ.. నమ్మిన విలువలతో పయనించిన ఆమె జీవితం కనిపిస్తుంది. అదే ఆమెకు ఆభరణంగా మారిందని చెప్పాలి. రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని ఆమె జీవితంలోకి వెళితే..
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లిలో జన్మించిన యాదమ్మకు పెళ్లి.. పదిహేనేళ్ల చిరుప్రాయంలోనే జరిగింది. అత్తింటివారు ఊరు పక్కనే ఉన్న కొండపూర్. పెళ్లైన కొద్ది కాలానికి కొడుకుపుట్టిన మూడు నెలలకే కూలి పని(మట్టి పెళ్లెలు కూలి)కి వెళ్లి మరణించాడు. దీంతో ఆమె ఎన్నో కలలు కన్న జీవితం ఒక్కసారిగా కూలిపోయింది. అత్తారింట్లో నరకం మొదలైంది. ఇలాంటివేళ.. 1993లో తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మూడు నెలల పసిబిడ్డను భుజాన వేసుకొని బస్టాప్ కు వచ్చిన ఆమె కరీంనగర్ బస్సు ఎక్కేసింది.
కొంతకాలం స్కూల్ ఆయాగా పని చేసిన ఆమె.. తర్వాత ఆమె వంట మాస్టారు వెంకన్న వద్ద పనికి కుదిరారు. అదే ఆమె జీవితాన్ని మార్చింది. రోజుకు రూ.15 కూలీతో మొదలైన ఆమె వేతనం.. ఈ రోజున లక్షల రూపాయిల కాంట్రాక్టుతో వేలాది మందికి భోజనం వండి పెట్టే వరకు ఎదిగింది. అలా అని.. ఆమెకు ఈ స్థానం ఊరికే రాలేదు. దాని వెనుక బోలెడంత శ్రమ.. కష్టం ఉంది. సాధారణంగా పెద్ద ఎత్తున భోజనాలు వండాలంటే మహిళల కంటే మగాళ్లే బాగా చేస్తారన్న భావన ఉంటుంది. దాన్ని తప్పు అని నిరూపించింది యాదమ్మ.
వేలాది మందికి సైతం భోజనాల్ని అందించే సత్తా ఆమె సొంతం. తెలంగాణ నాన్ వెజ్ వంటకాలు బాగా చేయటం ఆమెకో ప్లస్ పాయింట్. నిజానికి అదే ఆమెను మిగిలిన వారికి భిన్నంగా నిలిపింది. మటన్.. చికెన్.. నాటుకోడి.. బిర్యానీ.. నల్ల మాంసం.. బోటీ.. చేపల పులుసు.. చైనీస్.. ఇండియన్.. ఇలా అది ఇది అన్న తేడా లేకుండా అన్ని వంటలు చేయటం ఆమెకు అలవాటే. పని రావటంతో సరిపోదని.. క్రమశిక్షణ చాలా అవసరమని ఆమె చెబుతారు.
ప్రముఖుల ఇళ్లల్లో వంట చేయటం యాదమ్మకు కొత్తేం కాదు. ఆ మాటకు వస్తే సీఎం కేసీఆర్ అత్తారింట్లో పాతికేళ్లుగా ఏ ఫంక్షన్ జరిగినా వంట చేసేది యాదమ్మే. ఇంతకాలం నుంచి వంట చేస్తున్నా.. సీఎం కేసీఆర్ ను కలిసే అవకాశం రాలేదని చెప్పారు. మంచి ఫుడీ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ సాధారణంగా.. ఇలాంటి వారిని వెంటనే గుర్తిస్తుంటారు. యాదమ్మ విషయంలో ఏదో తేడా జరిగి ఉంటుందని చెప్పాలి. ఇక.. మంత్రి కేటీఆర్ కు ఆమె తెలుసు. ఆమె చేతి వంట ఎలా ఉంటుందన్నది తెలుసు. వీరే కాదు.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లల్లో ఏం ఫంక్షన్ జరిగినా సరే.. యాదమ్మ వంట తప్పనిసరి.
తన టీంతో 20 వేల మందికి వండి పెట్టే సత్తా యాదమ్మ సొంతంగా చెబుతారు. అంతేకాదు.. దాదాపు 30మంది మహిళలకు ఆమె ఉపాధిని ఇస్తున్నారు. ఆమె దగ్గర ట్రైనింగ్ అయిన పలువురు క్యాటరింగ్ చేసుకుంటున్నారని ఆమె గర్వంగా చెబుతారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత 50 వేల మందికి వండిన యాదమ్మ.. తీగల బ్రిడ్జి శంకుస్థాపనకు 20వేల మందికి వండిపెట్టారు. చిన్నతనంలో భర్త పోయిన తర్వాత.. తన సొంత కష్టంతో పైకి వచ్చిన యాదమ్మ.. పుట్టింటిని పెద్ద ఎత్తున ఆదుకోవటం ఆమెలోని మరో పార్శం. తండ్రి అనారోగ్యంతో చనిపోవటంతో.. ఇద్దరు తమ్ముళ్లు.. ఇద్దరు చెల్లెళ్ల బాధ్యతను ఆమె తీసుకున్నారు. తమ్ముడిని తన దగ్గరే ఉంచుకొని చదివించి పెళ్లి చేయటమే కాదు.. చెల్లె పెళ్లి కోసం తన వంతుగా సాయం చేసినట్లుగా ఆమె పేర్కొన్నారు.
విలువల విషయంలో రాజీ పడేది లేదని ఆమె చెబుతారు. ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ ఒప్పుకున్న తర్వాత.. దానికి పది రెట్లు పెద్దదైన ఫంక్షన్ ఆర్డర్ వచ్చినా.. ఎంతటి ప్రముఖులదైనా సరే.. నో చెప్పటమే తప్పించి.. ఎస్ అని చెప్పటం ఉండదని ఆమె స్పష్టం చేస్తారు. ఇక.. ప్రధాని మోడీకి వండే వంటకాలకు సంబంధించిన మెనూ విషయానికి వస్తే.. ముందుగా వివరాలు చెప్పరని.. కొద్ది గంటల ముందు చెబుతారని ఆమె చెబుతున్నారు. ఇక.. ప్రధాని మోడీకి రుచి చూపించేందుకు వీలుగా ఆమెకు ఆమె కొంత మెనూను సిద్ధం చేసుకున్నారు. అందులో.. మోడీకి ఇష్టమైన కిచిడీ.. గుజరాతీ వంటకమైన డోక్లా.. శనగపిండి.. మజ్జిగతో కలిపి చేసే ఖాండ్వీ .. మామిడి పచ్చడి.. శ్రీఖండ్ తో పాటు.. ముద్దపప్పు, గంగవాయిలి కూర, పప్పు చారు, పుంటికూర, ఆలుగడ్డ వేపుడు, పచ్చి పులుసు లిస్టులో ఉంది. వీటితో పాటు.. సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్ష్యాలు, పాయసం, పప్పుగారెలు కూడా ఉన్నాయి.