Begin typing your search above and press return to search.
రాజీవ్ గాంధీ హత్య మెలికలు.. మలుపులు ఎన్నో!
By: Tupaki Desk | 13 Nov 2022 10:52 AM GMTఒక నాయకుడి తీసుకున్న తప్పుడు నిర్ణయం అతడి ప్రాణాలను బలిగొంది. భారత దేశ రాజకీయాలను మలుపుతిప్పింది. ఆ హత్య కేసులో ఏడుగురికి మరణశిక్ష పడింది. ఆ తర్వాత ఈ శిక్ష యావజ్జీవ కారాగార శిక్షగా మారింది. ఇప్పడు దోషులను సుప్రీంకోర్టు విడిచిపెట్టడంతో మరోమారు దేశాన్ని నివ్వెరపరిచిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు.
1986 దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్‌గాంధీ ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్నారు. భారత్ పొరుగుదేశం శ్రీలంకలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ) తమిళులు అత్యధికంగా ఉన్న ప్రాంతాన్ని స్వయంప్రతిపత్తిగా ప్రకటించాలని పోరాడుతోంది. వీరంతా ఒకప్పుడు భారతీయులే. శ్రీలంకలో అత్యధికంగా పండే తేయాకు తోటల్లో మనదేశంలోని తమిళనాడు ప్రాంతం నుంచి ఎన్నో దశాబ్దాల కిందట శ్రీలంక తరలివెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. ఆ దేశ పౌరులుగానే చలామణి అయ్యారు.
అయితే శ్రీలంక దేశస్తులు అయిన సింహళీయులతో పోలిస్తే తమిళులను హీనంగా చూడటం, అభివృద్దికి దూరంగా ఉంచటం, వేషభాషలను కించపరిచే ధోరణి, సమాన హక్కులు కల్పించకపోవడం వంటి కారణాలతో తమిళుల హక్కుల కోసం ఎల్‌టీటీఈ ఆవిర్భవించింది. దీనికి నాయకుడు ప్రభాకరన్. ఈయన గెరిల్లా తరహా పోరాటాలతో శ్రీలంక ప్రభుత్వానికి చుక్కలు చూపించాడు. విదేశాల నుంచి నిధులు కూడా అందడంతో ఆయుధాలతో శ్రీలంక ప్రభుత్వానికి శత్రువుగా మారాడు.
దీంతో ఎల్‌టీటీఈని దెబ్బతీయడానికి శ్రీలంక.. 1986లో భారత్ సహాయం కోరింది. అప్పుడు భారతదేశ ప్రధానిగా రాజీవ్‌గాంధీ ఉన్నారు. శ్రీలంకలో ఉన్న తమిళులు ఒకప్పుడు భారతీయులేనని.. ఇప్పటికీ తమిళనాడులోనే వారి కుటుంబ సభ్యులు, బంధువులు స్నేహితులు ఉన్నారని గుర్తించని రాజీవ్‌గాంధీ శ్రీలంకకు శాంతి పరిరక్షణ దళం పేరుతో కొంత సైన్యాన్ని పంపారు.
భారత సైన్యం అండతో శ్రీలంక ఎల్‌టీటీఈ టైగర్స్ విరుచుకుపడింది. ఆ సంస్థను దాదాపు నామమాత్రం చేసింది. ఇదంతా రాజీవ్‌గాంధీ చేసిన పనితోనే జరిగిందని ఎల్‌టీటీఈ కక్ష గట్టింది. ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూసింది.
ఈ నేపథ్యంలో 1991 ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలిచి రాజీవ్ ప్రధాని అయితే తమకు ఇబ్బందులు తప్పవని ఎల్‌టీటీఈ భావించింది. ఈ క్రమంలో 1990 మే 21న రాజీవ్‌గాంధీ తమిళనాడులోని పెరంబుదూరుకు ప్రచారం కోసం వచ్చారు. ఈ సమయంలో ఆయనకు దండ వేసి కాళ్లకు నమస్కరించే సమయంలో మానవ బాంబుగా వచ్చిన థాను మానవ బాంబును పేల్చి రాజీవ్‌ను హత్య చేసింది. ఈ ఘటనలో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ తర్వాత విచారణ కోసం సిట్ ఏర్పాటు చేశారు. ఐదేళ్లపాటు సిట్ విచారణ జరిగింది. రాజీవ్ హత్యతో సంబంధమున్న ఏడుగురిని అరెస్టు చేశారు. రాజీవ్ హత్య ఘటనలో మరణించిన 12 మందితోపాటు పరారైన మరో ముగ్గురిని సహా మొత్తం 41 మందిని నిందితులుగా పేర్కొంది.
1998లో వీరిలో మురుగున్, సంథాను, పెరారివలన్, నళిని సహా మొత్తం 26 మందికి మరణశిక్ష పడింది. అయితే ఆ మరుసటి ఏడాదే పేరరివాళన్ సహా మురుగన్, నళిని, శాంతన్ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అనంతరం 2014లో పేరరివాళన్‌తో పాటు శాంతన్, మురుగన్ మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించింది. ఇక, సోనియాగాంధీ జోక్యంతో 2000 సంవత్సరంలో నళిని మరణశిక్షను కూడా యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించారు. ఆ తర్వాత మిగతా ముగ్గురికి కూడా మరణశిక్షను జీవితఖైదుకు తగ్గించారు.
ఈలోగా కేంద్రంలో బలమైన ప్రభుత్వాలు లేకపోవడం, తమిళనాడులో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదో ఒక పార్టీ అటు ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం రావడంతో శిక్ష అమలులో జాప్యం జరిగింది. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు లేకున్నా.. అనధికారికంగా నాన్చివేత ధోరణిని ప్రదర్శించారు ఢిల్లీ పెద్దలు.
నళిని, మురుగున్, సంథాను, పెరారివలన్ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరారు. రాస్ట్రపతి ప్రతిభా పాటిల్ వీరి క్షమాభిక్షను 2011లో తిరస్కరించారు. తమిళనాడు ప్రభుత్వం వీరికి క్షమాభిక్ష పెడుతూ వీరిని విడుదల చేయాలని సిఫార్సు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. వారిని విడుదల చేస్తూ తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎస్ నళిని, జయకుమార్, ఆర్‌పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్‌ల జైలు జీవితానికి విముక్తి లభించింది. వీళ్లంతా 1991 నుంచి ఇప్పటివరకు 30 ఏళ్లకుపైగా జైలుశిక్ష అనుభవించారు.