Begin typing your search above and press return to search.

దేవుళ్ళ పేరుతొ ట్విటర్ అకౌంట్స్ ... ఎవరు చేస్తున్నారంటే ?

By:  Tupaki Desk   |   7 Nov 2019 7:50 AM GMT
దేవుళ్ళ పేరుతొ ట్విటర్ అకౌంట్స్ ... ఎవరు చేస్తున్నారంటే ?
X
ఈ ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరు పొద్దున్న లేచినప్పటినుండి రాత్రి నిద్రపోయే వరకు అందులోనే మునిగి తేలిపోతుంటారు. అలాగే ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో .అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. ఇక సోషల్ మీడియా అంతే .. ట్విట్టర్ , పేస్ బుక్ , ఇంస్టాగ్రామ్ ఇలా చాలా వెబ్ సైట్స్ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా అకౌంట్స్ మనుషుల కేనా మాకు ఉంటే తప్పా అని దేవుళ్ళు అనుకున్నారేమో ఈ మధ్య దేవుళ్ళు కూడా ట్విట్టర్ అకౌంట్స్ ఓపెన్ చేసారు. నమ్మడం లేదా నిజం ..సోషల్ మీడియా లోని ట్విట్టర్ లో శ్రీరాముడు, సీత, రావణుడు, విభీషణుడు పేర్లతో అకౌంట్స్ కనిపిస్తున్నాయి.

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు మరికొద్ది రోజుల్లోనే ఫైనల్ తీర్పు ఇవ్వబోతుంది. ఈ నేపధ్యంలో ఇటువంటి అకౌంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో హిందూ మతానికి సంబంధించిన అంశాలు ఉంటున్నాయి.దీనితో యూపి లోని మీరఠ్ పోలీసులు ఇటువంటి ట్విట్టర్ అకౌంట్ల పై దృష్టి సారించారు. సైబర్ నిపుణుల బృందం ఈ పనిలో నిమగ్నమయ్యింది. దీని పై కొందరు నేతలు ఇలాంటి ట్విట్టర్ అకౌంట్ల తో ఊహించని ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఇటువంటి ట్విట్టర్ అకౌంట్లను సృష్టిస్తున్నవారు తమ పేరు, ఆచూకీ బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎందుకు అంటే.. రాముడి ట్విట్టర్ ఖాతాలో అడ్రస్ వైకుంఠం అని , అలాగే సీత చిరునామా అయోధ్య అని, విభీషణుడిన చిరునామా దగ్గర కింగ్ ఆఫ్ లంక అని రాశారు.