Begin typing your search above and press return to search.

ఏకంగా ఐటీ మంత్రి అకౌంట్ ను బ్లాక్ చేసిన ట్విట్టర్

By:  Tupaki Desk   |   25 Jun 2021 2:30 PM GMT
ఏకంగా ఐటీ మంత్రి అకౌంట్ ను బ్లాక్ చేసిన ట్విట్టర్
X
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. ఇప్పటికే కేంద్రం అమలు చేసిన ఐటీ నిబంధనలు ట్విటర్ అమలు చేయకపోవడంతో నోటీసులు కూడా జారీ అయ్యాయి. అయినా కూడా ట్విట్టర్ ఏమాత్రం కేంద్రం ఆదేశాలను పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. తాజాగా ఏకంగా కేంద్ర ఐటీశాఖ మంత్రికే షాకిచ్చింది.

కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్ ఖాతాను ట్విట్టర్ నిలిపేయడం సంచలనమైంది. తన ట్విట్టర్ ఖాతా గంటపాటు నిలిచిపోయినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. గత కొంతకాలంగా ట్విట్టర్ , కేంద్రప్రభుత్వం మధ్య విభేదాలు నెలకొన్న సమయంలో తాజా పరిణామం మరింత వీరిద్దరి మధ్య అగ్గిరాజేసినట్టైంది.

కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. 'ఈరోజు విచిత్రం జరిగిందని.. ట్విట్టర్ దాదాపు గంటపాటు నా ఖాతాను నిషేధించిందని.. అమెరికా డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం నిబంధనలు ఉల్లంఘించినానని నా ఖాతాను కొంతసేపు బ్లాక్ చేసింది. ఆ తర్వాత యాక్సిస్ ను పునరుద్దరించింది' అని రవిశంకర్ ప్రసాద్ సోషల్ మీడియాలో వెల్లడించారు.

ట్విట్టర్ చర్యలు నూతన ఐటీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని.. ఖాతాను యాక్సిస్ ను నిలిపివేసే ముందు తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.

నేను పోస్ట్ చేసిన టీవీ ఇంటర్వ్యూ వీడియోలపై కొన్నేళ్లుగా ఎవరూ కాపీరైట్ ఫిర్యాదులు చేయలేదు. కానీ ఫిర్యాదులు వచ్చినందు వల్లే ఖాతాను నిలిపివేశామని ట్విట్టర్ చెబుతోంది. ట్విటర్ ధిక్కార చర్యలపై తాను మాట్లాడినందుకే తన ఖాతాను బ్లాక్ చేసి ఉంటారు అని కేంద్రమంత్రి రవిశంకర్ అబిప్రాయపడ్డారు. వ్యతిరేకంగా మాట్లాడితే బ్లాక్ చేస్తారా? అని ప్రశ్నించారు. రూల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.