Begin typing your search above and press return to search.
పకోడీలు.. మిర్చి బజ్జీల మాదిరి 23.5 కోట్ల మంది ట్విటర్ డేటా సేల్
By: Tupaki Desk | 6 Jan 2023 7:38 AM GMTరోడ్డు పక్కన మిర్చి బజ్జీలు.. పకోడీలు అమ్మటం చూస్తూనే ఉంటాం. అదే మాదిరి ఎంతో విలువైన వ్యక్తిగత డేటా అమ్మకానికి రావటం ఇదేం కొత్త కాదు. తాజాగా ట్విటర్ లో ఖాతాలు ఉన్న 23.5 కోట్ల మంది వ్యక్తిగత డేటాను అమ్మకానికి పెట్టిన వైనం షాకింగ్ గా మారింది.
ఇజ్రాయల్ కు చెందిన సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ హడ్సన్ రాక్ సంచలన ప్రకటన చేసింది. సోషల్ మీడియాలో తోపు లాంటి ట్విటర్ కు చెందిన కోట్లాది మంది వ్యక్తిగత డేటా తమ వద్ద ఉందని.. దాన్ని తాము అమ్మకానికి సిద్ధంగా ఉంచినట్లుగా పేర్కొన్నారు.
సుమారు రెండు వారాల క్రితమే కోట్లాది మందికి చెందిన వ్యక్తిగత డేటా హ్యాకింగ్ కు గురైనట్లుగా తాము గుర్తించినట్లుగా పేర్కొన్నారు. అయితే.. దీనిపై ట్విటర్ ఇప్పటివరకు స్పందించలేదు. అంతేకాదు.. ఈ ఇష్యూను పరిష్కరించేందుకు ట్విటర్ ఏమైనా చర్యలు తీసుకున్న అంశంపైనా క్లారిటీ రావటం లేదు.
ఇంతకూ ఈ హ్యాకింగ్ కు పాల్పడిన వారు ఎవరన్న దానిపైనా స్పష్టత రావటం లేదు. హడ్సన్ రాక్ అంచనా ప్రకారం ఈ హ్యాకింగ్ 2021 చివర్లోనే జరిగినట్లుగా చెబుతున్నారు. ట్విటర్ లోని ఏపీఐలోని లోపంతో వ్యక్తిగత డేటాను దొంగలించి ఉంటారనిభావిస్తున్నారు.
తాజా హ్యాకింగ్ పరిణామంతో ప్రముఖలతో పాటు జర్నలిస్టుల వ్యక్తిగత సమాచారం కూడా బయటకు పొక్కిందని చెబుతున్నారు.
ఆ మధ్యన ట్విటర్ కు చెందిన 40 కోట్ల మంది యూజర్ల డేటా లీక్ అయినట్లు పేర్కొన్నప్పటికీ.. తాజాగా మాత్రం ఆ సంఖ్యను తగ్గిస్తూ.. 23.5 కోట్ల మందిగా హడ్సన్ రాక్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆయన పేర్కొన్నట్లుగా ఇదే నిజమైతే.. భారీ ఎత్తున వ్యక్తిగత డేటాకు ప్రమాదం వాటిల్లినట్లేనని చెప్పక తప్పదు. మరి.. దీనిపై ట్విటర్ కాస్తంత స్పష్టత ఇచ్చేలా ప్రకటన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.