Begin typing your search above and press return to search.

ట్విట్టర్ ఉద్యోగులు సేఫ్.. ఎలాన్ మస్క్ క్లారిటీ

By:  Tupaki Desk   |   27 Oct 2022 6:48 AM GMT
ట్విట్టర్ ఉద్యోగులు సేఫ్.. ఎలాన్ మస్క్ క్లారిటీ
X
ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ చూపు మళ్లీ ట్విట్టర్ పై పడింది.. ప్రపంచంలోనే నంబర్ 1 మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియాను సొంతం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని మరో రెండురోజుల్లోనే ముగిస్తానని.. శుక్రవారం నాటికి క్లోజ్ చేయబోతున్నట్టు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిన్న ప్రకటించారు. ఈ మేరకు బ్యాంకర్లకు తెలియజేశారు. ఈ ఒప్పందానికి కావాల్సిన నిధులను సమకూరుస్తున్న బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మాట్లాడిన ఎలాన్ మస్క్ ఈ మేరకు హామీ ఇచ్చారు.

దీంతో ట్విట్టర్ ఉద్యోగుల్లో కంగారు మొదలైంది. ట్విట్టర్ కొనుగోలు పూర్తవగానే మస్క్ కఠిన నిర్ణయం తీసుకుంటారని.. ఉద్యోగాల్లో 75 శాతం కోత విధిస్తారని వస్తున్న వార్తలపై ట్విట్టర్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. 75 శాతం ఉద్యోగులను తొలగించాలన్న ఆలోచన తనకు లేదని మస్క్ వివరణ ఇచ్చాడట.. ఆస్థాయిల్లో వేటు పడకపోయినా ఉద్యోగాల్లో కోత తప్పేలా లేదని సమాచారం. ఈ నేపథ్యంలో మస్క్ ఎంతమందిని తొలగిస్తారనే విషయంపై సందిగ్ధత నెలకొంది.

ఇక ట్విట్టర్ సీఈవోగా ఉన్న భారతీయుడు పరాగ్ ను సాగనంపేందుకు ఎలన్ మస్క్ రెడీ అయినట్టు సమాచారం. ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలును ఆయన వ్యతిరేకిస్తూ లేఖలు రాస్తూ అసమ్మతి రాజేస్తున్నారు. అందుకే ట్విట్టర్ మస్క్ చేతుల్లో పడగానే తొలి వికెట్ పడేది సీఈవో పరాగ్ పైనేనని అంటున్నారు.

బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని శుక్రవారం నాటికి ముగించాలని భావిస్తున్నారు. మస్క్ తన ఉద్దేశాన్ని సహ-పెట్టుబడిదారులకు ఇప్పటికే తెలియజేశాడని, ట్విట్టర్ కొనుగోలు ఇష్యూను క్లోజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ ట్విటర్ డీల్‌కు నిధులు సమకూరుస్తున్న బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా డీల్ అమలు జరగాలని భావిస్తున్నారు.ట్విట్టర్ డీల్ అక్విజిషన్ రిపోర్ట్ కూడా బ్యాంకులు తుది క్రెడిట్ ఒప్పందాన్ని పూర్తి చేశాయని పేర్కొంది. ఇప్పుడు, డీల్‌ను త్వరలో ముగించడానికి డాక్యుమెంటేషన్‌పై సంతకం చేసే ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది.

ఈ ట్విటర్ ఒప్పందం తదుపరి దశకు చేరుకోవడంతో దక్షిణ కొరియాకు చెందిన మిరే అసెట్ ఫైనాన్షియల్ గ్రూప్.. ఎలోన్ మస్క్ ద్వారా ఈ ట్విటర్ కొనుగోలుకు ఆర్థిక సహాయం చేయడానికి సుమారు 300 బిలియన్ల కొరియన్ వోన్‌లను నిధులుగా సమకూర్చాలని యోచిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ ట్విట్టర్ కొనుగోలు కోసం ఎలోన్ మస్క్ $46.5 బిలియన్ల ఈక్విటీ , డెట్ ఫైనాన్సింగ్‌ ద్వారా నిధులను సమకూర్చుతున్నాడు. ఇది కాకుండా మోర్గాన్ స్టాన్లీ , బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పోరేషన్ వంటి బ్యాంకులు $13 బిలియన్ల డాలర్ల నిధులను అందించడానికి ఒప్పుకున్నాయి. ఇంత భారీగా అప్పులు చేసి మరీ ట్విట్టర్ ను కొనడానికి ఎలన్ మస్క్ డిసైడ్ కావడం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.