Begin typing your search above and press return to search.

డజన్ల కొద్దీ తొలగించన ఉద్యోగులను తిరిగి రమ్మంటున్న ట్విటర్?

By:  Tupaki Desk   |   7 Nov 2022 7:30 AM GMT
డజన్ల కొద్దీ తొలగించన ఉద్యోగులను తిరిగి రమ్మంటున్న ట్విటర్?
X
ప్రపంచంలోనే నంబర్-1 కుబేరుడు ఎలాన్ మస్క్ $44 బిలియన్ డాలర్లు వెచ్చించి ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. ట్విటర్ ఎలన్ మస్క్ చేతుల్లోకి రాగానే కంపెనీ సీఈవో నుంచి మొదలుపెడితే సీఎఫ్ఓ ఇతర ఉన్నతాధికారులను తొలగించేశాడు. ఆ తర్వాత కంపెనీకి భారం అంటూ ట్విట్టర్ లో శుక్రవారం దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించాడు. అయితే సడెన్ గా ఈ నిర్ణయాన్ని సవరించారు. ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన డజన్ల కొద్దీ ఉద్యోగులను తిరిగి చేర్చుకుంటున్నారు. వారిని తిరిగి రావాలని ట్విటర్ వేడుకుంటోందట.. ఈ మేరకు తీసేసిన ఉద్యోగులకు తిరిగి మెయిల్ చేస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

తిరిగి రావాలని కోరుతున్న వారిలో కొందరు పొరపాటున తొలగించబడ్డారని... ఎలోన్ మస్క్ ఊహించిన కొత్త ఫీచర్లను రూపొందించడానికి వారి పని , అనుభవం అవసరమని మేనేజ్‌మెంట్ గ్రహించి ఇలా వెనక్కి పిలుస్తోందట..

ట్రస్ట్ -సేఫ్టీ టీమ్‌లోని ఉద్యోగులతో సహా ట్విట్టర్ ఇటీవల తన ఉద్యోగులలో 50% మందిని తొలగించిందని కంపెనీ సేఫ్టీ అండ్ ఇంటెగ్రిటీ హెడ్ యోయెల్ రోత్ ఈ వారం ప్రారంభంలో ఒక ట్వీట్‌లో తెలిపారు.

సోషల్ మీడియా కంపెనీ సిబ్బంది చేసిన ట్వీట్లలో కమ్యూనికేషన్స్, కంటెంట్ క్యూరేషన్, హ్యూమన్ రైట్స్ , మెషిన్ లెర్నింగ్ ఎథిక్స్‌కు బాధ్యత వహించే టీమ్‌లు కొన్ని ఉత్పత్తి ,ఇంజినీరింగ్ టీమ్‌లు కూడా ఉన్నాయి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఎలాన్ మస్క్ మొదటి సంస్కరణగా బ్లూ టిక్ ఉన్న ప్రముఖులు సంస్థలు దాని కోసం $8 డాలర్లు వసూలు చేయడం ప్రారంభించడాడు. డబ్బులు చెల్లిస్తేనే వారికి బ్లూటిక్ ఉంటుంది. ఈ మేరకు ట్విటర్ శనివారం ఆపిల్ యాప్ స్టోర్‌లో తన యాప్‌ను అప్‌డేట్ చేసింది.

అయితే ఈ తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకునే విషయంపై పలు మీడియా సంస్థలు ఆరాతీయగా ట్విట్టర్ వెంటనే స్పందించలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.