Begin typing your search above and press return to search.
ట్విట్టర్‌పై నల్లజాతీయుల ఆగ్రహం.. కారణం ఏమిటంటే..
By: Tupaki Desk | 22 Sep 2020 5:33 PM GMTసమాజంలో మనకు అడగడుగునా తారసపడే జాతి వివక్ష, వర్ణవివక్ష, కుల వివక్ష ఇప్పడు సమాజిక మాధ్యమాలకు పాకిందనే విషయం తెలిసందే. అయితే ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సంస్థ ట్విట్టర్ కూడా ఈ వివక్షను చూపుతుందట. ట్విట్టర్ కేవలం తెల్లజాతి వాళ్ల ఫొటోలను మాత్రమే కనిపించేలా చేసి.. నల్లజాతి వాళ్లను పక్కన పెడుతున్నదని ప్రస్తుతం నెటిజన్లు మండిపడుతున్నారు. ఇందుకు కారణమేమిటి.. ఈ తరహా విమర్శలు ఎందుకొస్తున్నాయో తెలుసుకుందాం.. సాధారణంగా మనం ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా, వాట్సాప్ వంటి సోషల్ సైట్లలో ఫొటోలు అప్లోడ్ చేయాలంటే సదరు సైట్లు మనఫొటోలను క్రాప్ చేసి తీసుకుంటాయి. మనం అప్లోడ్ చేసే ఫొటోలు రకరకాల సైజులు, రకరకాల ప్రపోర్షన్లలో ఉంటాయి.
అయితే ఆయా ఫొటోలను సదరు సోషల్ నెట్వర్కింగ్ సంస్థలు అవసరం ఉన్నమేరకు క్రాప్‌చేసి పెడతాయి. అందుకోసం ఆయా సోషల్నెట్వర్క్ సంస్థలు ప్రత్యేకంగా కొన్ని సాఫ్ట్వేర్లను యాప్‌లను రూపొందించుకుంటాయి. వాటినే స్మార్ట్ క్రాపింగ్ టూల్స్ అంటారు. సాధారణంగా ఇటువంటి టూల్స్ ఫొటోలోని మధ్యభాగాన్ని హైలెట్ చేసి.. చుట్టుపక్కల ఉన్న భాగాల్ని తీసేస్తూ ఉంటాయి. ఇందుకోసం సోషల్ సైట్ ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న కోడ్ ఇంజన్ మన ఫొటోను ఎలా క్రాప్చేయాలో నిర్ణయిస్తుంది. ఇందుకోసం ముందుగానే ప్రొగ్రామింగ్ను డిజైన్ చేసి పెడతారు.
ఇలా ఫొటో క్రాప్ చేసేటప్పుడు ఫొటోలోని ఏ భాగాన్ని ఉంచాలి.. ఓ భాగాన్ని తీసేయాలి అన్నది ఆ కోడ్ ఇంజిన్‌కు ఎలా తెలుస్తుంది. అంటే కోడ్‌లోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఈ పనిని పూర్తిచేస్తుంది. 2018లో ట్విట్టర్ ఓ కొత్తతరహా క్రాపింగ్ టూల్‌ను ప్రవేశపెట్టింది. దీనిపేరు స్మార్ట్క్రాపింగ్ టూల్. అయితే ఇప్పడు ఈ స్మార్ట్ క్రాపింగ్ టూల్ పైనే ప్రధాన విమర్శలు వెల్లువెతుతున్నాయి.
ఈ టూల్ కేవలం తెల్లగా ఉన్నవాళ్లను మాత్రమే చూపించి.. నల్లజాతి వాళ్లను వదిలేస్తుందట. ఇందుకు ఓ ఉదాహరణ ఏమిటంటే.. అమెరికన్ పొలిటీషియన్ మిచ్ మెక్ కానల్ తెల్లగా ఉంటారు. ఆయన బొమ్మను మాజీ అధ్యక్షుడు ఒబామాతో కలిపి పెట్టారు. అయితే ఈ టూల్ కేవలం మిచ్ను ఉంచి ఒబామాను తీసేస్తోంది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు తెల్లజాతీయులు, నల్లజాతీయుల ఫొటోలను ఉంచినప్పుడు కేవలం తెల్లవాళ్ల ఫొటోలను మాత్రమే ట్విట్టర్ ఉంచుతుందోట. దీంతో ఇంటర్నెట్లో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ట్విట్టర్ దిద్దుబాటు చర్యలకు దిగింది. టూల్ మొత్తాన్ని మార్చివేస్తున్నట్టు సమాచారం.