Begin typing your search above and press return to search.

మోడీ స‌ర్కారును కోర్టుకు లాగ‌నున్న ట్విట్ట‌ర్‌.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   6 July 2022 12:30 AM GMT
మోడీ స‌ర్కారును కోర్టుకు లాగ‌నున్న ట్విట్ట‌ర్‌.. రీజ‌న్ ఇదే!
X
ఇదొక చిత్ర మైన వ్య‌వ‌హారం. నిత్యం ట్విట్ట‌ర్ వినియోగించే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ట్విట్ట‌ర్ రారాజుగా పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు ఉన్న ఫాలోవ‌ర్లు.. ప్ర‌పంచంలోనే ఆయ‌న‌ను ముందుండేలా చేశారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. ఆయ‌న ట్వీట్ చేస్తుంటారు. విష‌యం ఏదైనా.. ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పంచుకుంటారు. ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌పంచానికి అనేక విష‌యాలు ఆయ‌న వెల్ల‌డిస్తుంటారు. త‌న ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలే కాకుండా.. స‌మ‌యానికి త‌గిన విధంగా జ‌రిగే విష‌యాలను కూడా ఆయన పంచుకుంటారు. అయితే.. ఇప్పుడు అదే ట్విట్ట‌ర్‌.. మోడీ స‌ర్కారును కోర్టుకు లాగాల‌ని నిర్ణ‌యించుకుంది.

మ‌రి ఇలా ఎందుకు జ‌రిగింది? మోడీ స‌ర్కారును ట్విట్ట‌ర్ సంస్థ ఎందుకు కోర్టులో ప్ర‌శ్నించాల‌ని అనుకుంటోంది? అనేది ఆస‌క్తిగా మారింది. ట్విట్ట‌ర్‌లో ప్ర‌ధాని మోడీ మాదిరిగానే చాలా మంది త‌మ త‌మ అభిప్రాయాలు పంచుకుంటారు. నిజానికి ఇది సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం.

వ్య‌క్తులు త‌మ అభిప్రాయాల‌ను పంచుకునే వేదిక‌. ఈ క్ర‌మంలో కొంద‌రు ప్ర‌భుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు ఇది కూడా అభిప్రాయం కింద‌కే వ‌స్తుంది. అయితే.. ఇవ‌న్నీత‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని.. ఈ కంటెంట్ల‌ను తొల‌గించాల‌ని.. ఇటీవ‌ల కేంద్రం ట్విట్ట‌ర్‌ను ఆదేశించింది.

సెలెక్టివ్ కంటెంట్‌ను ఉపసంహరించుకోవాలని ట్విట్టర్‌ను ఆదేశించినందున భారత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, అలా చేయకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నట్లు అమెరికాకు చెందిన ట్విట్ట‌ర్ సంస్థ పేర్కొంది. ఇది భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు భంగ‌మ‌ని పేర్కొంటోంది. ఈ క్ర‌మంలోనే మోడీ స‌ర్కారుపై కోర్టులో దావా వేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ట్విట్ట‌ర్ తెలిపింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం.. దేశంలో కోవిడ్ పరిస్థితిని అదుపు చేయ‌డంలోను.. మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌డంలోను.. ఆక‌స్మికంగా.. లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంలోనూ.. ప్ర‌భుత్వం చేసిన నిర్వాకంతో అనేక రంగాలు దెబ్బ‌తిన్నాయ‌నే విమ‌ర్శ‌లు ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌చ్చాయి. అయితే.. ఇవ‌న్నీ..త మ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని.. పేర్కొంటున్న మోడీ ప్ర‌భుత్వం వీటిని తొలగించాలని ట్విట్టర్‌ను కోరినట్లు తెలిసింది.

ఈ క్ర‌మంలోనే ట్విట్టర్ ఇప్పుడు మోడీ ప్రభుత్వంపై దావా వేసింది. అధికార దుర్వినియోగాన్ని పేర్కొంటూ కొత్త నిబంధనలపై న్యాయ సమీక్షను కోరాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే.. ఈ విష‌యం దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం జ‌రిగినా.. ట్విట్ట‌ర్ మోడీ స‌ర్కారును కోర్టుకు లాగుతున్న‌ట్టు తెలిసినా.. కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు అలానే ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి మున్ముందు ఈ వివాదం ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.