Begin typing your search above and press return to search.

హెయిర్ డ్రయ్యర్, ఇస్త్రిపెట్టెలతో నవ్వులపాలైన బీసీసీఐ..

By:  Tupaki Desk   |   6 Jan 2020 9:07 AM GMT
హెయిర్ డ్రయ్యర్, ఇస్త్రిపెట్టెలతో  నవ్వులపాలైన బీసీసీఐ..
X
అస్సాం రాజధాని గౌహతి లో నిన్న తడి పిచ్ కారణం గా ఆగి పోయిన ఇండియా- శ్రీలంక మొదటి టి20 మ్యాచ్ నవ్వుల పాలైంది. ఒక్క బంతి పడకుండా తడి కారణంగా మ్యాచ్ ను నిలిపి వేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. వర్షం తో తడిసిన గ్రౌండ్ ను ఆర బెట్టడానికి గ్రౌండ్ సిబ్బంది చేసిన పనులతో బీసీసీఐ పరువు పోయింది. క్రికెట్ పిచ్ తడిగా ఉన్నందున, పిచ్ పొడిగా మార్చడానికి గ్రౌండ్ సిబ్బంది జుట్టును ఆరబెట్టే హెయిర్ డ్రయ్యర్లను ఉపయోగించిన వైనంపై నెటిజన్లు, ప్రేక్షకులు దుమ్మెత్తి పోశారు. ప్రపంచం లోనే సంపన్న బీసీసీఐ కి ఒక పిచ్ ను ఆరబెట్టడానికి కనీస వసతులు లేవా? హెర్ డ్రయ్యర్ల ను వాడుతారా అని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.

కేవలం హెయిర్‌ డ్రయ్యర్లు మాత్రమే కాకుండా బట్టలను ఇస్త్రీ చేసే ఇస్త్రీ పెట్టెలను కూడా పిచ్‌లో ఉపయోగించారు. ఈ ఫొటోలు వీడియోలు విపరీతం గా షేర్ చేస్తూ నెటిజన్లు బీసీసీఐ తీరును ఎండగడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు షెడ్యూల్ చేసినప్పుడు వర్షాలను ఎదుర్కోవటానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) ని సోషల్ మీడియాలో నిందిస్తున్నారు.

పిచ్‌లో వాడే హెయిర్‌ డ్రయ్యర్లు , ఇస్త్రీ పెట్టలను పెట్టి ఎండబెట్టిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది నెటిజన్లు ఈ ఫొటోలను చూసిన కామెడీ చేస్తూ బీసీసీఐని ట్రోల్ చేస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. చిత్రవిచిత్రమైన హ్యాష్ ట్యాగ్ లతో బీసీసీఐని చెడుగుడు ఆడుతున్నారు.

మైదానంలో ఒక్క బాల్ పడకుండా మ్యాచ్ రద్దవ్వడంపై.. తమ అభిమాన క్రికెట్ తారలను చూడలేక పోవడంపై అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సంపన్న క్రికెట్ బోర్డుగా పేరొందిన బిసిసిఐ దేశవ్యాప్తంగా క్రికెట్ మైదానాలకు కనీస వసతులు సౌకర్యాలు కల్పించకపోవడంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనప్పుడు పరిష్కరించడానికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.