Begin typing your search above and press return to search.
ట్రంప్ పరువును బజార్లో పెట్టిన బాత్ రోబ్
By: Tupaki Desk | 8 Feb 2017 6:47 AM GMTవివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా.. పరుష వ్యాఖ్యలకు తన నోరే పుట్టినిల్లుగా చేసుకొని నిత్యం అందరి నోళ్లల్లో ఏదో రకంగా నానే ట్రంప్ కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆయన ఇమేజ్ ను మరింత పెంచాల్సిన అధికారి అత్యుత్సాహం ఆయన్ను కామెడీ కామెడీగా మార్చటమే కాదు.. సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ నవ్వులపాలు అయ్యేలా చేసింది. ఇప్పుడీ వ్యవహారాన్ని అందరూ ఆసక్తిగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఈ ఉదంతం ఎలా జరిగిందన్నది చూస్తే..
వైట్ హౌస్ లో ట్రంప్ మీడియా వ్యవహారాల్ని చూసే అధికారి స్పైసర్. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడిపైన.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపైనా మీడియా సంస్థలు విమర్శనాత్మకంగా కథనాలు రాసేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ఇదే తీరులో ఆయనపై ఒక కథనం రాసింది. అందులో.. బాత్ రోబ్ ధరించిన ట్రంప్ అంటూ ప్రస్తావించింది. ఇంతకీ బాత్ రోబ్ అంటే.. స్నానం చేసిన తర్వాత.. నిద్ర పోయే టైమ్ లో అమెరికా లాంటి ప్రాశ్చాత్య దేశాల్లోని వారు గౌన్ లాంటి దాన్నిధరిస్తుంటారు. మీడియా కథనంలో రాసిన అంశాన్ని ప్రస్తావించి.. దాన్ని ఖండించాల్సింది పోయి.. కథనంలో ప్రస్తావించిన బాత్ రోబ్ గురించి మాట్లాడిన స్పైసర్.. ట్రంప్ కు అసలు బాత్ రోబ్ లేదని... ఆయన ధరించినట్లుగా రాయటాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. మీడియా చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ విరుచుకుపడ్డారు.
ఇలాంటి సిల్లీ విషయాల్ని ప్రస్తావించటం ద్వారా స్పైసర్ తనకు తెలీకుండా తానే పెద్ద పొరపాటు చేశారు. ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని మీడియా కంటే సోషల్ మీడియా సీరియస్ గా తీసుకుంది. ట్రంప్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు బాత్ రోబ్ ధరించిన ఫోటోలతో సహా.. రకరకాల ఫోటోల్ని సోషల్ మీడియాలో ముంచెత్తారు. అంతేనా.. ట్విట్టర్ లో అయితే.. ప్రత్యేకంగా హ్యాష్ టాగ్ లు పెట్టి మరీ ఎటకారం చేసేసుకున్నారు.
ట్రంప్ కు అసలు బాత్ రోబ్ లేదన్న మాటకు ప్రతిగా.. ఆయన అందులో ఉన్న మూడు ఫోటోల్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పలు హోటళ్ల యజమానికి ఒక్క బాత్ రోబ్ కూడా లేదా? అంటూ పెద్ద ఎత్తున ఎకసెక్కాలు ఆడేశారు. మొత్తానికి బాత్ రోబ్ మాటతో ట్రంప్ నవ్వుల పాలయ్యారని చెప్పక తప్పదు. ట్రంప్ తన నోటితో తనకు తాను చిక్కుల్లో పడటం ఇప్పటివరకూ చూశాం. ఆయన ఇమేజ్ ను పెంచాల్సిన అధికారులు సైతం అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యతో ఆయన్ను పలువురు కామెడీ కామెడీ చేసేసుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/