Begin typing your search above and press return to search.
ఆర్మీలో క్రికెటర్ ధోనీ కాస్తా ఎలా మారిపోయాడంటే...!
By: Tupaki Desk | 8 Aug 2019 1:30 AM GMTభారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచకప్ లో స్లో బ్యాటింగ్ తో విమర్శలు ఎదుర్కోవడంతో ప్రపంచకప్ తర్వాత అతడు క్రికెట్ కు అవుతాడని వార్తలు జోరుగా వినిపించాయి. ప్రతి ఒక్కరూ ధోని వరల్డ్ కప్ తర్వాత ఇక క్రికెట్ ఆడడని డిసైడ్ అయిపోయారు. అయితే వచ్చే 20 - 20 ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగాలని డిసైడ్ అయిన ధోని... తాజా వెస్టిండీస్ పర్యటనకు స్వయంగా తప్పుకోవడంతో యువ క్రికెటర్ రిషిబ్ పంత్ ధోనీ స్థానాన్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక క్రికెట్ కు కాస్త విరామం ప్రకటించిన ధోనీ ఆర్మీలో తన పని తాను చేస్తున్నాడు. ఇప్పటివరకు ధోని మనకు ఒక క్రికెటర్ గా... విజయవంతమైన కెప్టెన్ గా మాత్రమే తెలుసు. కానీ ధోనిలో మనకు తెలియని కళలు చాలానే ఉన్నాయని అతడు ఆర్మీలో పని చేస్తుంటే తెలుస్తోంది. ప్రస్తుతం కశ్మీరు లోయలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సైనిక విధులు నిర్వహిస్తున్న ధోనీ సైన్యంలో పని చేయాలన్న సంకల్పంతో రెండు నెలల పాటు క్రికెట్ కు విరామం ఇచ్చి మరి దక్షిణ కశ్మీర్ లోని పారా రెజిమెంట్ విభాగంలో డ్యూటీ చేస్తున్నాడు.
ఒకవైపు ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు ఖాళీ సమయంలో తన తోటి సైనికులను ఆటపాటలతో అలరిస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కభీ కభీ సినిమాలోని ' మై పల్ దో పల్ కా షాయర్ హు' నే పాటను పాడి తోటి సైనికులను అలరించాడు. ధోనీ స్వయంగా ఈ పాట పాడడంతో సైనికులు క్లాప్స్ తో ధోనీని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ధోనీ తన షూ పాలిస్ చేసుకుంటున్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఆర్మీ సిబ్బందితో సరదాగా వాలీబాల్ ఆడుతూ సరదాగా ఎంజాయ్ చేశాడు. ధోనీ భారతదేశ సైన్యంలో పనిచేస్తూ చాలా సింపుల్ గా ఉండడంతో నెటిజన్లు - క్రీడాభిమానులు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా ధోనీ క్రికెట్ ఆటగాడిగానే కాకుండా ఆర్మీ ఆఫీసర్ గా దేశం కోసం పనిచేయడంతో పాటు ఇటు సింగర్ గాను - అటు వాలీబాల్ ప్లేయర్ గాను చాలా కళల్లో ప్రావీణ్యం ఉన్నట్టే కనిపిస్తున్నాడు.