Begin typing your search above and press return to search.

నెలకు 20 డాలర్లు.. ట్విట్టర్ వినియోగదారులకు షాకిచ్చేందుకు ఎలన్ మస్క్ ప్లాన్లు?

By:  Tupaki Desk   |   31 Oct 2022 6:30 AM GMT
నెలకు 20 డాలర్లు.. ట్విట్టర్ వినియోగదారులకు షాకిచ్చేందుకు ఎలన్ మస్క్ ప్లాన్లు?
X
ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ ఇలా గద్దెనెక్కాడో లేదో అలా.. అందులోని ఉన్నతాధికారులను తొలగించి వసూళ్ల పర్వం మొదలుపెట్టడానికి రంగం సిద్ధం చేశాడు. ట్విట్టర్ కు ఆదాయం పెంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ధృవీకరణ కోసం ట్విటర్ వినియోగదారుల నుంచి రాబోయే రోజుల్లోనే నెలకు $20 డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించారు. ధృవీకరణ కోసం వినియోగదారులకు నెలకు $19.99 వసూలు చేయాలని. ఇది త్వరలోనే అమలు చేసేందుకు నిర్ణయించింది.

ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్న ఎలన్ మస్క్ ఈ మేరకు వినియోగదారులకు షాక్ లు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఈ మేరకు ఉద్యోగులకు ఎలోన్ మస్క్ మొదటి టాస్క్ ఇచ్చినట్టు సమాచారం. ప్లాట్‌ఫారమ్‌లో చెల్లింపు ధృవీకరణను ప్రారంభించడానికి అతని గడువు విధించాడు. రాబోయే కొన్ని నెలల్లోనే ట్విట్టర్ లో చెల్లింపు సేవలు మొదలుకానున్నాయి. బ్లూటిక్ ఉన్న సినీ, రాజకీయ, పారిశ్రామక ప్రముఖులు, సంస్థలు ఇక ట్విట్టర్ లో ఆ సెలబ్రెటీ హోదా దక్కాలంటే డబ్బులను ట్విట్టర్ కు చెల్లించాల్సిందే . ఈ మేరకు ఉద్యోగులు వెంటనే దీన్ని అమలు చేయాలని.. చేయకుంటే ఉద్యోగాల నుంచి వెళ్లిపోండని ఎలన్ మస్క్ హుకూం జారీ చేశాడట..

ట్విట్టర్ లో బ్లూ టిక్ ఉన్న ప్రముఖులు, అదనపు ఫీచర్‌లను కలిగి ఉన్న వారు సంస్థ నుంచి నెలకు $4.99 ఐచ్ఛిక సభ్యత్వం తీసుకోవాలని.. ఆ వినియోగదారులకు మాత్రమే ధృవీకరించే ఖరీదైన సబ్‌స్క్రిప్షన్‌గా మారుతుందని కండీషన్ పెట్టారు.. ధృవీకరించబడిన వినియోగదారులు తమ బ్లూ చెక్‌మార్క్‌ను ఉంచడానికి ప్రస్తుత ప్లాన్‌లో సభ్యత్వాన్ని పొందేందుకు 90 రోజుల సమయం ఉంటుందని నివేదిక పేర్కొంది. నవంబర్ 7 గడువులోగా ఫీచర్‌ను ప్రారంభించడంలో విఫలమైతే రద్దు చేయబడుతుందని ట్విట్టర్ ఉద్యోగులకు ఈ మేరకు దిశానిర్ధేశం చేశాడట.. ఇది త్వరలోనే అమలు చేయనున్నారట..

ట్విట్టర్ లో ప్రధాని మోడీ నుంచి మన చిరంజీవి, రాజమౌళి వరకూ ప్రముఖుల అధికారిక ట్విట్టర్ ఖాతాలకు బ్లూ టిక్ మార్క్ ఉంటుంది. ఇక కంపెనీలు, సంస్థలు, సినీ నిర్మాణ సంస్థలకు ఇలా ఉంటుంది. అలా ఉండాలంటే రాబోయే రోజుల్లో నెలకు కొంత మొత్తం చెల్లించాలన్న మాట. దీన్నే ఎలన్ మస్క్ అమలు చేయడానికి డిసైడ్ అయ్యాడు.

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం క్రితం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. కొంతమంది ప్రచురణకర్తల నుండి ప్రకటనలు లేకుండా కథనాలను చదవడం, అప్లికేషన్‌లో ఇతర మార్పులు చేయడం, హోమ్ స్క్రీన్‌పై యాప్ చిహ్నం యొక్క రంగును మార్చడం వంటివి ఇందులో కల్పిస్తారు.. సెలబ్రెటీలకు బ్లూటిక్ ఇచ్చి వారి అధికారిక ఖాతాలకు ట్విట్టర్ గుర్తింపునిచ్చింది. అయితే ఇప్పుడు దీన్నే ఆదాయమార్గంగా మలచాలని ఎలన్ మస్క్ ప్లాన్ చేస్తున్నారు. ట్విట్టర్ వ్యాపారం మొత్తం ఆదాయంలో సగభాగాన్ని కవర్ చేయడానికి సబ్‌స్క్రిప్షన్‌లను పెంచాలని మస్క్ కోరుకుంటున్నారు.

ప్లాట్‌ఫారమ్‌ను విస్తరించవచ్చని లేదా ప్లాట్‌ఫారమ్‌లోని 280-అక్షరాల పరిమితిని తొలగించవచ్చని ఇటీవల మస్క్ చెప్పారు. తన ఆధ్వర్యంలోని కంపెనీ వీడియోల నిడివిని పెంచడం ద్వారా వినియోగదారులు ఎక్కువ వీడియోలను పోస్ట్ చేయగలరని కూడా అతను భావిస్తున్నాడు. తద్వారా ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు.

ఎలన్ మస్క్ చేస్తున్న ప్రయోగాలు మరీ కంపెనీని లేపుతాయా? పడేస్తాయా? అన్నది వేచిచూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.